అప్పుడు ‘మహానేత’ ఎందుకు ఓడిపోయారు? 

21PRKL04A
14మంది మంత్రులు, 30మంది ఎమ్మెల్యేలు, 200 కోట్లు, వైఎస్సారు రోడ్డు షోలు

ప్రజలు వెర్రిపప్పలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధమాక్ లేని నాయకులూ కొందరు వాదిస్తున్నారు.

2006 కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికలు గుర్తున్నాయా? వై.ఎస్.రాజశేఖర్రెడ్డి యెంత 14 మంది మంత్రులను, 30 మంది ఎమ్మెల్యేలను ప్రచారంలో దించారు. 200 కోట్లు ఖర్చు చేశారు. వైెఎస్సారు రెండు రోజులు కరీంనగరంలో బసచేసి పెద్ద ఎత్తున రోడ్డు షోలు నిర్వహించారు. కానీ ప్రజలు తలుచుకుంటే ఏమైంది? అంతటి ‘మహానేతను’ ఎలా నేలకేసి కొట్టారు?

కాంగ్రెస్, బీజేపీలు టీడీపీతో, ఆంధ్ర మీడియాతో జట్టుకట్టి చేసిన దుర్మార్గపు దాడిని ప్రజలు చీత్కరించుకున్నారు. కనీసం డిపాజిట్ కూడా దక్కని దుస్థితి తెచ్చుకున్నారు. ఇది కెసీఆర్ నాయకత్వ విజయం. ప్రభుత్వ విజయం. తెలంగాణా విజయం.