నరేంద్ర మోడీ అజీర్తి

విభజన చట్టం అష్టవంకరలతో రూపొందించారని చెప్పిన మోడీ ఈ నాలుగేళ్లలో వాటిని సరిదిద్దడానికి ఎందుకు ప్రయత్నించలేదో చెబితే బాగుండేది. నిజానికి నరేంద్ర మోడీ విభజన చట్టంలోని లోపాలను సరిచేయలేక కాదు. ఇష్టం లేకనే ఇన్ని వేషాలు వేశారని ఇప్పుడు అర్థం అవుతున్నది.

మనసులో గూడుకట్టుకున్న భావాలు ఏదో ఒక బలహీనక్షణంలో బయటపడతాయి. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం విషయంలో తను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తను ఎవరి పక్షమో, అప్పుడు తను ప్రధానిగా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కూడా మోడీ చెప్పకనే చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారు అన్నాడే కానీ, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు సాగకుండా ఆంధ్ర నాయకత్వం చేసిన వికృత చేష్టలను వేటినీ మోడీ గుర్తు పెట్టుకోలేదు.

అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర విభజనకు అంగీకరించి చివరి నిమిషంలో మాటమార్చడం గురించి కానీ, దొంగ రాజీనామా బెదిరింపులు కానీ, పార్లమెంటులో విభజన బిల్లుకు అడుగడుగునా అడ్డుపడడం, సభాధ్యక్షులను అవమానించడం, పెప్పర్ స్ప్రేకు దిగడం…ఇవేవీ నరేంద్రమోడీ ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన జరుగుతున్న కాలంలో విభజనను వ్యతిరేకించే ఏకైక నినాదం తప్ప, తమ రాష్ర్టానికి కావలసిందేమిటో అడగని ఆంధ్ర నాయకత్వం గురించి కూడా ఆయన మాట్లాడలేదు. అశాస్త్రీయ విభజన అంటూ మాటిమాటికీ వాపోతున్న మోడీ, బాబు, వారి ఇతర వందిమాగధులకు గర్తుకురాని విషయమేమంటే, కాంగ్రెస్ విభజన చట్టం రూపొందిస్తున్నప్పుడు, ఇరు ప్రాంతాల-ఇతర పార్టీల నాయకులను క్రమంతప్పకుండా సంప్రదించి, వారి సూచనలను, సలహాలను పరిగణిస్తూనే తయారు చేశారు. ఈ సంప్రదింపుల్లో బీజేపీని కూడా భాగం చేశారు. సహకరించనిది, సమస్యలు సృష్టించింది ఆంధ్రా నాయకత్వమే. 2014 ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్ర మోడీ దాదాపు ఇలాగే మాట్లాడారు. అప్పటికీ ఇప్పటికీ ఆయన మనసులో ఉన్నది అదే. తన నాలుగేళ్ల అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని ఆడిపోసుకునే ఏకైక విన్యాసానికి మోడీ దిగారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణను దారుణంగా అవమానించారు. నరేంద్రమోడీ ఆంధ్రకే కాదు, తెలంగాణకూ అన్యాయం చేశారు. విభజన చట్టంలో కాంగ్రెస్ చేసిన తప్పులను వల్లెవేసిన నరేంద్రమోడీ ఈ నాలుగేళ్లలో తాను చేసింది ఏమిటో కూడా చెప్పి ఉంటే బాగుండేది. విభజన చట్టం అష్టవంకరలతో రూపొందించారని చెప్పిన మోడీ ఈ నాలుగేళ్లలో వాటిని సరిదిద్దడానికి ఎందుకు ప్రయత్నించలేదో చెబితే బాగుండేది. నిజానికి నరేంద్ర మోడీ విభజన చట్టంలోని లోపాలను సరిచేయలేక కాదు. ఇష్టం లేకనే ఇన్ని వేషాలు వేశారని ఇప్పుడు అర్థం అవుతున్నది.

భద్రాచలం నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. వారి ఎమ్మెల్యే ఖమ్మంలో ఉన్నారు. విభజన కారణంగా అక్కడ ఒక రాజ్యాంగ సమస్య ఉత్పన్నమైంది. 2019 ఎన్నికల్లో భద్రాచలంలో ఓటర్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కలిసిన ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. పెద్దపెద్ద సమస్యలు పరిష్కరించినట్టు చెప్పుకునే ఈ అభినవ సర్దారు పటేలుకు ఇంత చిన్న సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వీలు పడలేదో బీజేపీ నేతలు చెప్పాలె.

నరేంద్రమోడీ రాజ్యాంగ సవరణలు అవసరమైన విధాన నిర్ణయాలను కూడా అనేకం ఈ నాలుగేళ్లలో తీసుకున్నారు. జనజీవితాలను విపరీతంగా ప్రభావితం చేసిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటివి పార్లమెంటు ఆమోదం పొందాయి. నాలుగు బడ్జెట్‌లు ఆమోదం పొందాయి. పార్లమెంటులో మెజారిటీ లేకపోతే ఇవేవీ ముందుకు సాగేవి కాదు. అంతెందుకు ఎన్‌డీఏ రాగానే గోదావరికి ఆ ఒడ్డు ఈ ఒడ్డున ఏడు మండలాలను తెలంగాణ నుంచి లాగేసి, ఆంధ్రలో విలీనం చేస్తూ చట్టాన్ని తెచ్చింది. మరి అదే మోడీ విభజనను పూర్తి చేయడానికి ఎందుకు పూనుకోలేదు. వాజపేయి మూడు రాష్ర్టాలను ఎటువంటి పేచీలేకుండా గొప్పగా విభజించారని మోడీ చెప్పారు. ఇప్పుడు అదే గొప్పతనాన్ని చాటుకుని మోడీ విభజన చట్టంలోని తప్పిదాలను ఎందు సరిచేయలేదు? రెండు ప్రాంతాల ప్రజలకు ఎందుకు మేలు చేయలేదు? తెలంగాణను పూర్తిగా ఎందుకు విస్మరించారు. చట్టంలో ఇచ్చిన ఓ మోస్తరు హామీలను కూడా ఎందుకు అమలు చేయలేదు? విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎందుకు నాన్చుతున్నారు. హైకోర్టు విభజన ఎందుకు చేయలేదు? న్యాయాధికారుల విభజన ఎందుకు పూర్తి చేయలేదు? ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ కార్పొరేషన్ల సిబ్బంది, రాష్ట్ర యూనివర్సిటీల విభజన ఇంకా రావణకాష్టంలా ఎందుకు కాలుతూనే ఉంది? వాజపేయి మూడు రాష్ర్టాల విభజన చేసినప్పుడు కోర్టుల విభజన ఇలాగే జరిగిందా? విభజన చట్టంలోని లోపాలను సరిచేయడానికి ఈ నాలుగేళ్లు చాలలేదా?

రాజకీయ సుస్థిరతకోసం అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని సూచిస్తే ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాజ్యాంగ సవరణ చేయకుండానే చట్టంలో సవరణ చేసి అమలు చేసే వీలు ఉంది. రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా పార్లమెంటులో అవసరమైన రాజకీయ ఏకాభిప్రాయం కూడా ఉంది. ఎన్‌డీఏతోపాటు ప్రతిపక్షాలు కూడా రెండు రాష్ర్టాలలో అసెంబ్లీ సీట్లు పెంచడాన్ని సమర్థించేవే. అయినా ఎందుకు చొరవ తీసుకోలేదు. అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలోనే ఇన్ని డ్రామాలు ఆడిన బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయమే చేయాల్సి వస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవారో, ఎవరి మాటలు వినేవారో చెప్పనవసరం లేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఇక్కడి నుంచి తొలగించి ఆంధ్రలో కలిపారు. భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. భద్రాచలం నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. వారి ఎమ్మెల్యే ఖమ్మంలో ఉన్నారు. విభజన కారణంగా అక్కడ ఒక రాజ్యాంగ సమస్య ఉత్పన్నమైంది. 2019 ఎన్నికల్లో భద్రాచలంలో ఓటర్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కలిసిన ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. పెద్దపెద్ద సమస్యలు పరిష్కరించినట్టు చెప్పుకునే ఈ అభినవ సర్దారు పటేలుకు ఇంత చిన్న సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వీలు పడలేదో బీజేపీ నేతలు చెప్పాలె.

తెలుగు నేలపై ఒక సంక్షుభిత వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ దానిని తొలగించడానికి ఎంత చొరవ తీసుకోవాల్సి ఉండింది? కానీ మోడీకి అటువంటి స్పందనలేమీ ఉండవని, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడని, అమరావతికి మట్టి తెచ్చి ఇచ్చిన నాడే అర్థం చేసుకుని ఉండాలి. ఆయన ఈ నాలుగేళ్లూ అదే వైఖరిని ప్రదర్శించారు. పెద్ద పెద్ద మాటలు, చాలా చిన్న చేతులు, చేతలు.

సమైక్య రాష్ట్రంలో సాగునీరు విషయంలో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ. ఆగమేఘాలపై ప్రాజెక్టులు నిర్మించుకోవలసిన అవసరం ఉన్నది తెలంగాణకే. అందుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేయింబవళ్లు వెంటపడి ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తున్నారు. తెలంగాణలో అరవైశాతం భూభాగానికి ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టును గరిష్టంగా నీరు ఉపయోగించుకునే విధంగా డిజైను చేసి పనులు జరిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ చాలాకాలంగా కోరుతున్నది. కేంద్రం నుంచి ఒక్క సానుకూల మాట ఇప్పటివరకు రాలేదు. పైగా తెలంగాణ ప్రజల గుండెల్లో పొడిచే మాటలు మాట్లాడుతున్నారు. తెలుగు నేలపై ఒక సంక్షుభిత వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ దానిని తొలగించడానికి ఎంత చొరవ తీసుకోవాల్సి ఉండింది? కానీ మోడీకి అటువంటి స్పందనలేమీ ఉండవని, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడని, అమరావతికి మట్టి తెచ్చి ఇచ్చిన నాడే అర్థం చేసుకుని ఉండాలి. ఆయన ఈ నాలుగేళ్లూ అదే వైఖరిని ప్రదర్శించారు. పెద్ద పెద్ద మాటలు, చాలా చిన్న చేతులు, చేతలు.

నరేంద్ర మోడీ ఈ నాలుగేళ్లలో జనానికి చేసిన మేలు కంటే నష్టమే ఎక్కువని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఎన్నికల్లో వరుసగా ప్రజలు తేల్చి చెబుతూ వచ్చారు. ఆయన ఓటు బలం తగ్గిపోతూ వచ్చింది. దేశాన్ని ఒక స్వేచ్ఛా ప్రజాస్వామిక భావాలతో వర్ధిల్లే సమాజంగా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయాన్ని, లాభాలను సమకూర్చే ఒక కంపెనీ స్థాయికి మార్చిన ఘనత మోడీకి దక్కుతుంది. ప్రజల ఆర్థిక స్వేచ్ఛపై దాడి జరిగింది. ప్రజలు స్వేచ్ఛగా కనీసం లక్ష రూపాయలు దాచుకోలేని ఒక దుస్థితి వచ్చింది. ఒక అతీతభయాన్ని ప్రజలపై రుద్దారు. మరోవైపు కంపెనీలు, సంపన్న వర్గాలు యధేచ్ఛగా నల్లధనాన్ని, తెల్ల ధనాన్ని పోగేయగలుగుతున్నాయి. నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ పేదవాళ్లకే గానీ పెద్దవాళ్లకు కాదన్న భావన జనాలలో వచ్చింది. ఈ వ్యతిరేకతను దారి మళ్లించడానికే అసందర్భ ఆవేశాలు, అనవసర విషయాలపై మోడీ నోరు పారేసుకున్నారు. కానీ జనం దృష్టిమళ్లించడం ప్రతిసారీ సాధ్యమయ్యే పనికాదు.