సైంధవుల సయ్యాట

మహాభారతం ఒక గొప్ప రాజకీ య కావ్యం. అందులో కనిపించని రాజకీయపాత్రలు లేవు. కౌరవ పాండవుల పెనుగులాట లాగా ఇప్పుడూ ఎప్పుడూ అధికారం కోసం పెనుగులాట సహ జం. ఎవరు కౌరవులు, ఎవరు పాండవులన్నది ఇప్పుడేమో ప్రజలు నిర్ణయిస్తున్నారు. ప్రధాన పాత్రలు కాకుండా భారతంలో సైంధవుడు, శల్యుడు, శిఖండి, కర్ణుడు, అశ్వత్థామ.. వంటి చాలా పాత్రలున్నాయి. ఒకటి మంచికి, మరొకటి చెడుకు, ఇంకొకటి త్యాగానికి, స్నేహానికి, మరొకటి ద్రోహానికి ప్రతీకలు. ప్రధాన పాత్రలు కాకుండా చాలా తరచుగా ఇటువంటి పాత్రల గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు సైంధవుడు. సింధు రాజు. ఆయన అసలుపేరు జయద్రథుడు. కౌరవుల ఏకైక సోదరి దుస్సల భర్త.

అంటే పాండవులకు కూడా బావ వరుస. అటువంటి వాడు ఒకసారి అరణ్యవాసంలో ఉండగా జయద్రథుడు వరుసకు సోదరి అయిన ద్రౌపదిని చూసి మోహించి, రథంపై లాక్కెళుతుంటాడు. ఈ విషయం తెలిసిన పాండవులు ఆయనను వెంబడించి, బంధించి, జుట్టు కొరిగించి, అవమానించి పంపుతారు. ఆ అవమానంతో తపస్సు చేస్తాడు. పాండవులపై ప్రతీకారం తీర్చుకునే శక్తిని ఇవ్వమని శివుడిని అడుగుతాడు. అంతశక్తిని ఇవ్వలేను కానీ, ఒకరో జంతా పాండవ యోధులను నిలువరించే శక్తిని ఇస్తున్నాను. ఒక్క అర్జునుడిని మాత్రం ఎవరూ నిరోధించలేరు అని శివుడు చెబుతాడు. కురుక్షేత్రంలో పద్మవ్యూహం పన్నిన రోజున అర్జునుడిని ఉద్దేశపూర్వకంగా మరోవైపు మళ్లించి, పద్మవ్యూహంతో పాండవ సేనను ఛిన్నాభిన్నం చేస్తుంటారు ద్రోణాది కౌరవసేన. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఒక్కరు కూడా అడుగు ముందుకువేయలేకపోతారు. అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలోకి వెళ్లగలుగుతాడు. కానీ బయటికి రాలేడు. కౌరవయోధులంతా కలిసి అభిమన్యుడిని చంపుతారు. దానికి ప్రతీకారంగా అర్జునుడు మరుసటిరోజు సైంధవుడిని చంపుతాడు. ఒక్కరోజు పాండవ యోధులను నిలువరించగలుగడం, పాక్షిక నష్టం కలిగించగలుగడం సైంధవుడి పాత్ర. సైంధువుడు దుష్కర్ముడు. దుష్టపాత్ర. అభిమన్యుడి హత్యకు కారకుడు. ఆధునిక రాజకీయాల్లో ఎవరినైనా తిట్టాల్సి వస్తే ఈ పేరుతో తిట్టడం అందుకే. వీరు యుద్ధాన్ని గెలువలేరు. ఏదో తెలియని బాధ, దుగ్ధ ఉంటాయి. ఎవరినో గెలిపించడానికి, మరెవరినో ఓడించడానికి పనికివస్తారు.

“వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుంది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్తే పిల్లలు పనికిరారు. అందరికీ భూమి ఉంటే మన పొలాల్లో ఎవరు పనిచేస్తారు? ఇది తరతరాలుగా సాగుతున్న ఆలోచనాధార. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ ఆలోచనాధార నుంచి బయటపడటం లేదు. రైతులకు పరిహారం ఇవ్వాలనడం, పునరావాసం కల్పించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు. ప్రభుత్వం చట్టం ద్వారానే ఆ పనులన్నీ చేస్తున్నది. ఇంకా నష్టపోతున్నామని ఎక్కడైనా రైతులు వాదిస్తే అదనపు సాయం కూడా అందిస్తున్నది.” 

పవన్‌కల్యాణ్ గురించి ఒక మిత్రుడు ఇదేమాట అన్నాడు. అందుకే పైకథ అంతా చెప్పాల్సి వచ్చింది. పవన్‌కల్యాణ్ అమాయకుడు, భోళా అని మరో మిత్రుడు అన్నాడు. సైంధవుడా, అమాయకుడా అన్న ప్రశ్న ఆయన మాటలు, ప్రవర్తనను చూసి అర్థం చేసుకోవాలి. ఆయన గెలువాలనుకొని, మార్పు తేవాలనుకొని రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపించదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్మార్ట్ సీఎం అంటారు. ఆయన పాలన బాగుందంటారు. మళ్లీ తెలంగాణలో అన్ని స్థానాలకు పోటీ చేస్తానంటాడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడుతూ చాలా మిస్టీరియస్ పాత్ర పోషిస్తున్నాడనిపిస్తుంది. వసంత కోకిలలాగా ఎన్నికల రుతువులో పాటపాడే సినీ నాయకుడు కనిపిస్తారాయనలో. 2009 ఎన్నికలకు ముందు నుంచి నిన్న మొన్నటిదాకా ఆయన మాటల్లో వచ్చిన మార్పులన్నీ గుదిగుచ్చి ఎవరో మిత్రుడు ఒక వీడి యో పంపారు. ఆయనలో ఎన్ని వైరుధ్యాలో. ఎంత నిలకడలేని తనమో. ఎంత చపలచిత్తమో. ఎంత అవకాశవాదమో. ఆయన చేగో బొమ్మ పెట్టుకుంటే ఒకప్పుడు మురిసిపోయాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనిపించేదంతా వాస్తవం కాదని, లోపలి మనుషులు వేరే ఉంటారని అర్థం అవుతుంది. పవ న్‌కల్యాణ్ తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పు డు తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా తీర్మానం చేశారు. పవన్‌కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తూ ఆవేశంతో ఊగిపోతూ నేను మీకు అండగా ఉంటా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను సైతం అంకితమవుతానని చెప్పారు. 2009 డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం రాగానే అడ్డం తిరిగారు. గడ్డం గీసుకున్నంత తేలికగా రాష్ట్రాన్ని విడదీస్తారా అని ప్రశ్నించారు. విభజన జరిగినప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఒక్కరోజు కాదు రెండు రోజు లు కాదు 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పా డు. కేసీఆర్ తాటా తీస్తా అని బీరాలు పలికాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ ఇంకా చాలాచాలా మాట్లాడాడు. అటువంటి మనిషి ఇప్పు డేం మాట్లాడుతున్నాడు? జై తెలంగాణ, వందేమాతరం వంటి ఒక మహావాక్యమట. కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమట. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతాయేమో. తెలంగాణకు నిజంగా కేసీఆర్ చాలు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ వంటి టుమ్రీ రాజకీయవాదులు అవసరంలేదు. పిచ్చికూతలతో, పిచ్చి ఆవేశాలతో ఇక్కడ వాతావరణం చెడగొట్టకుంటే చాలు. చిరంజీవిలో ఉన్నపాటి స్థిరత్వం, గాంభీర్యం కూడా ఈ మనిషిలో లేదు.

“రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. మాట్లాడే ప్రతిమాటకు పొంతన ఉండాలి. సంబద్ధత ఉండాలి. కొనసాగింపు ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం ఉండా లి. ఇవి లేని విన్యాసాలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతాయి. పవన్‌కల్యాణ్ అయినా, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకైనా అదే వర్తిస్తుంది.”

రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. మాట్లాడే ప్రతిమాటకు పొంతన ఉండాలి. సంబద్ధత ఉండాలి. కొనసాగింపు ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం ఉండా లి. ఇవి లేని విన్యాసాలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతాయి. పవన్‌కల్యాణ్ అయినా, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకైనా అదే వర్తిస్తుంది. ప్రతిపక్షాలది మరీ విచిత్ర వైఖరి. విశాల జనబాహుళ్య ప్రయోజనాలు చూడాలా లేక కొద్దిమంది కక్షిదారు ల ప్రయోజనాలు చూస్తారా? కాంగ్రెస్, బీజేపీలు ప్రజాపక్షపాతం కలిగిన రాజకీయపక్షాలుగా కాకుం డా కోర్టు కక్షిదారులుగా మారిపోయాయి. కరువు సీమకు ఎన్నో ఏండ్లు ప్రాతినిధ్యం వహించిన నాగం జనార్దన్‌రెడ్డి కేసుల ఉద్యమం నడిపిస్తున్నారు. జేఏసీ నాయకులు సైతం కేసుల వెంటే పరుగెడుతున్నారు. కాంగ్రెస్ సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. ఈ కక్షిదారుల మనస్తత్వం భూస్వామ్య సంస్కృతి నుం చి పుట్టుకొచ్చింది. వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుం ది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్తే పిల్లలు పనికిరారు. అందరికీ భూమి ఉంటే మన పొలాల్లో ఎవరు పనిచేస్తారు? ఇది తరతరాలుగా సాగుతున్న ఆలోచనాధార. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ ఆలోచనాధార నుంచి బయటపడటం లేదు. రైతులకు పరిహారం ఇవ్వాలనడం, పునరావాసం కల్పించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు. ప్రభుత్వం చట్టం ద్వారానే ఆ పనులన్నీ చేస్తున్నది. ఇంకా నష్టపోతున్నామని ఎక్కడైనా రైతులు వాదిస్తే అదనపు సాయం కూడా అందిస్తున్నది. అన్నిరకాలుగా నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అదీ నచ్చకపోతే కోర్టులో అదనపు పరిహారం కోసం కొట్లాడే అవకాశమూ ఉంది. రాజకీయ లక్ష్యాలు, వాంఛలు, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు అవరోధాలుగా మార డం రాష్ర్టానికి మంచిది కాదు.

నిజానికి ఈ పరిహారాల గురించి ఆలోచించకుండానే చాలా ప్రాజెక్టుల కింద రైతులు తమ భూము ల్లో కాలువలు తవ్వనిచ్చారు. నల్లగొండ జిల్లాలో వరదకాలువ కింద చాలామంది రైతులు భూములు ఎప్పుడో ఇచ్చేశారు. కనీసం భూ సేకరణ నోటిఫికేషన్ కూడా రాకుండానే భూములు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొన్ని గ్రామా ల రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి భూములు ఇచ్చారు. వాళ్లు దేవుళ్లు. ఎందుకంటే నీరు బంగారమని, జీవనాధారమని, నీటి కంటే ఏదీ విలువైనది కాదని అర్థం చేసుకున్నవాళ్లు, నమ్మినవాళ్లు కాబట్టి వారు అలా చేశారు. రాజకీయ నాయకత్వం అటువం టి వారికి అండగా నిలబడి సత్వర న్యాయం జరిగేట్టు చూడాలి. నీళ్లు లేకపోతే ఎన్ని ఎకరాల భూమి ఉంటే ఏమిటి ప్రయోజనం? రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ తాగు, సాగునీటి కోసం తన్లాడింది. నీరు లేక తెలంగాణ ఎలా వెనుకబడిపోయిందో అందరికీ అనుభవంలో ఉన్నదే. స్వరాష్ట్ర ఉద్యమం కారణంగానే ఆంధ్ర నాయకత్వం తెలంగాణలో ఆదరాబాద రా అడ్డగోలు ప్రాజెక్టులు మొదలుపెట్టింది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన శక్తులు ఇప్పుడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఫ్రంటు గట్టడం అంటే అం తకంటే విడ్డూరం ఏముంటుంది? నిన్నటి మన ఎజెం డా ఇవ్వాళ ఎందుకు ఎజెండా కాకుండాపోయింది? అభివృద్ధి పథంలో సైంధవులు కాకూడదని అందరూ అర్థం చేసుకుంటే తెలంగాణకు మేలు జరుగుతుంది.