భూములేలినా బుద్ధి మారదా!

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది.హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింది కూడా చంద్రబాబే. ఆ కాలంలోనే హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హుడా) నిధులను విజయవాడ-గుంటూరు-తెనాలి అభివృద్ధి సంస్థకు మళ్లించింది కూడా ఆయన కాలంలోనే. ఆయన ఇతర రంగాలను సర్వనాశనం చేసిందీ నిజం. పల్లెలను, వ్యవసాయాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులను వదిలేసి ప్రపంచ బ్యాంకు ఎజెండాను మోసింది నిజం. తెలంగాణను రైతు ఆత్మహత్యల తో వల్లకాడుగా మార్చింది కూడా ఆ పదేళ్లలోనే.

ఎలుకతోలు తెచ్చి ఎన్నేళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని వేమన చెప్పింది ఎంత సత్య మో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, ఆయన ప్రభుత్వం తెలంగాణ గురించి చేస్తు న్న సూత్రీకరణలు చూస్తే తెలుస్తుంది. ఒక్క చం ద్రబాబు నాయుడే కాదు నీతి ఆయోగ్ వైస్ చైర్మ న్ రాజీవ్‌కుమార్ కూడా అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో చాలా తెలివితక్కువ వాదన చేశారు. తెలంగాణకు వచ్చే పన్నుల ఆదాయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రావారు చెల్లిస్తున్నదే 50 శాతం ఉంటుందని, వారంతా అమరావతికి వస్తే ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు చాలా అనుభవం కలిగిన నాయకునిగా చెప్పుకుంటారు. రాజీవ్‌కుమార్‌కు కూడా గొప్ప ఆర్థిక నిపుణునిగా పేరుంది. తెలంగాణవాళ్లకు వ్యవసాయం చేయడం రాదని కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖలు రాసిన ఇంజినీర్లు కూడా నిన్నమొన్నటిదాకా హైదరాబాద్ నీళ్లూ, కూడూ అనుభవించినవాళ్లే. ఇటువంటి మనుషులు ఇంత విచక్షణారహితంగా ఎలా మాట్లాడగలుగుతున్నారన్నదే ప్రశ్న. హైదరాబాద్ రాజధాని కాబట్టి, బతుకుదెరువు బాగుంటుంది కాబట్టి, ఎదుగడానికి అవకాశాలు ఎక్కువగా ఉం టాయి కాబట్టి, రెండు రాష్ర్టాలతోపాటు దేశంలోని అన్నిరాష్ర్టాల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగాలు చేశారు, వ్యాపారాలు చేశారు, పరిశ్రమలు ప్రారంభించారు, స్థలం కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, రోడ్లు వేయించుకున్నారు, సుఖవంతమైన జీవితం చూసుకున్నారు. ఇందులో ఏదీ లోకోద్ధరణ కోసం జరుగలేదు. ఎవరి సంగతో ఎందుకు? నేను మా ఊరి నుంచి హైదరాబాద్ నగరానికి హైదరాబాద్‌లో ఉన్నవారిని, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణవారిని ఉద్ధరించడంకోసం రాలేదు. బతుకడం కోసం వచ్చా ను. ఇక్కడ స్థిరపడ్డాను. బతుకుదెరువులో భాగంగా నా ప్రవృత్తికి తగిన ఒక వృత్తిని ఎంచుకున్నాను. అందులో పనిచేస్తున్నాను. కాలక్రమంలో ఎదిగాను. ఇవ్వాళ నేను కూడా పన్ను కడుతున్నాను. అదంతా ఒక బాధ్యత కలిగిన పౌరునిగా తప్ప, ఉద్ధరణ కాదు.

భారతీయులు అదృష్టవంతులు. వారికి బ్రిటిష్ పాలకు లు, అందునా శ్వేతజాతీయుల పాలన లభించింది. లేకపోతే వారు ఎప్పటికీ బాగుపడేవారు కాదు అని వెనుకటికి ఓ శ్వేత జాతి దురహంకార మేధావి చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తేడా ఏమీ లేదు. ఇద్దరిదీ దురహంకారమే. అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఒకరు ఆలోచిస్తారు. ఒకరు విధాన కల్పన చేస్తారు. మరొకరు ఆచరణ మొదలుపెడుతారు. ఇంకొకరు పూర్తి చేస్తారు. మళ్లీ మరో ఆలోచన మొదలవుతుంది. ఇందులో ఎవరి పాత్ర వారిది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏ ప్రాంతం వారికైనా ఇదే లాజిక్ వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రవారంతా అమరావతికి వస్తే బాగుంటుందని చంద్రబాబునాయుడుకు ఉండవచ్చు. అది అర్థం చేసుకోవచ్చు. కానీ రాజీ వ్‌కుమార్‌కు ఎందుకుండాలి? ఎందుకంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక ఉపశమనం చేకూర్చే మాటలు చెప్పాలి. అందుకు ఇటువంటి తలతిక్కవాదన చేసి ఉం టాడు. రాష్ర్టాలు విడిపోయినప్పుడు ఏ రాజధాని అయినా బోసిపోదు. ఎడారి కాదు. మద్రాసు నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మారిన తర్వాత సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు ఎందుకు రాలేదు? మా వాళ్లతోపాటే మేము ఎందుకు అనుకోలేదు? అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి. మద్రాసులో, కోయంబత్తూరులో పరిశ్రమలు పెట్టిన ఆంధ్రా పారిశ్రామికవేత్తలు అన్నీ మూసేసుకుని ఆంధ్రకో హైదరాబాద్‌కో వచ్చారా? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించి ఎదిగినవారే. మద్రాసు నుంచి వ్యాపారా లు మోసుకొచ్చినవారు అతి తక్కువ. ఇటువంటి అర్థరహితమైన వాదనలు గతంలోనూ జరిగాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ను విడదీసేప్పుడు బొంబాయిపై ఇదేవిధంగా రచ్చ చేశారు. బొంబాయిలో వ్యాపారాలన్నీ గుజరాతీలవేనని, అందువల్ల బొంబాయిని గుజరాత్‌కు రాజధానిగా కొనసాగించాలని వాదించారు. బొంబాయిని గుజరాత్ నుంచి విడదీస్తే బొంబాయి బోసిపోతుందని బెదిరించారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? అక్కడ వ్యాపారాలు మూతపడలేదు. బొంబాయి దేశ ఆర్థిక రాజధాని అయింది. గుజరాతీ లు గుజరాత్‌లో కొత్తగా వ్యాపారాలు పెట్టుకున్నారు. రెండు రాష్ర్టాలు ఎదిగాయి. ఇప్పుడూ తెలంగాణ, ఆం ధ్రలో అదే జరిగితే సంతోషం. అంతే కానీ రెండు రాష్ర్టాలకు పోటీపెట్టి మాట్లాడటం, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు అన్యాయం జరిగిపోయిందంటూ చీటికీ మాటికీ వాపోవడం రాజనీతిజ్ఞత కాదు, రాజకీయ దివాళాకోరుతనం. ప్రజలను భావోద్వేగాలపరంగా రెచ్చగొట్టడం వారికి మంచిది కాదు.

1995కు ముందు హైదరాబాద్‌లో ఏముంది? ఇప్పుడేముంది? అని చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఇంత రాజకీయ అనుభవం ఏమైందో అర్థం కాదు. హైదరాబాద్ చంద్రబాబు పుట్టకముందు, ఎన్‌టీఆర్ రాక ముందు కూడా వైభవంగానే ఉంది. భారతీయులు అదృష్టవంతులు. వారికి బ్రిటిష్ పాలకు లు, అందునా శ్వేతజాతీయుల పాలన లభించింది. లేకపోతే వారు ఎప్పటికీ బాగుపడేవారు కాదు అని వెనుకటికి ఓ శ్వేత జాతి దురహంకార మేధావి చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తేడా ఏమీ లేదు. ఇద్దరిదీ దురహంకారమే. అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఒకరు ఆలోచిస్తారు. ఒకరు విధాన కల్పన చేస్తారు. మరొకరు ఆచరణ మొదలుపెడుతారు. ఇంకొకరు పూర్తి చేస్తారు. మళ్లీ మరో ఆలోచన మొదలవుతుంది. ఇందులో ఎవరి పాత్ర వారిది. దేశంలోకి కంప్యూటర్లు తేవాలని రాజీవ్‌గాంధీ ఆలోచించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల ను ప్రారంభించాలన్న ఆలోచన అప్పటిదే. 1993లో నే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మాదాపూర్ రాజీవ్‌గాంధీ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశా రు. ఎన్‌టీఆర్ కు చేసిన ద్రోహం తాలూకు పాపాలను కడిగేసుకోవ డం కోసం బాబు అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలపై దృష్టిని కేంద్రీకరించిన మాటవాస్తవం. ఐటీ రంగం అభివృద్ధి వేగిరపరచింది నిజం. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి ఏమీ ఆపలేదు. అడ్డుకోలేదు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఇంకా స్వేచ్ఛగా అభివృద్ధి పథం సాగుతున్నది. మునుపెన్నడూ లేనంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను మరిం త మహోజ్వల నగరంగా తీర్చిదిద్దడానికి బాటలు వేస్తున్నారు. మొత్తంగా ఈ అభివృద్ధి ప్రస్థానంలో నేనుగానీ లేకపోతే… అనే సంభాషణే అవసరం లేని ది. ఎవరి పాత్ర వారికి ఉంటుంది. కేటీఆర్ నిజాయితీగా చంద్రబాబు చేసిన కృషిని ఒక వేదికపై చెప్పారు. ఆ గౌరవాన్ని చంద్రబాబు కాపాడుకుంటే మంచిది. అది కాకుండా హైదరాబాద్‌ను, తెలంగాణను కించపరిచే భాషను గానీ, వాదనను గానీ తెలంగాణ ప్రజ లు అంగీకరించరు.

ప్రకాశం బరాజు రాకముందు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏమి పంటలు వేసేవారో, ఎంత పంట పండించేవారో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి, కనీ సం మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లలోకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. ప్రకాశం బరాజు, దానిపైన నాగార్జున సాగరం వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు వారు వరిపంటలో ఆరితేరి ఉండవచ్చు. సాగునీటికి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసుకోవడం తెలంగాణ రైతులకు సాధ్యమైతే బంగారం పండిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఎప్పటిదాకో ఎందుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం రికార్డు స్థాయి లో వరిపంట దిగుబడి వచ్చింది. తెలంగాణ రైతు కరెంటుకోసం, పెట్టుబడి కోసం, ఎరువులకోసం ఎదురుచూడటంలోనే తన శక్తినంతా ధారపోస్తూ వచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ కష్టాలనుంచి విముక్తి చేసింది కాబట్టి అంత పంట దిగుబడి వచ్చింది.

ఎందుకంటే తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది. హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింది కూడా చంద్రబాబే. ఆ కాలంలోనే హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) నిధులను విజయవాడ-గుంటూరు-తెనా లి అభివృద్ధి సంస్థకు మళ్లించింది కూడా ఆయన కాలంలోనే. ఆయన ఇతర రంగాలను సర్వనాశనం చేసిందీ నిజం. పల్లెలను, వ్యవసాయాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులను వదిలేసి ప్రపంచబ్యాంకు ఎజెండా ను మోసింది నిజం. తెలంగాణను రైతు ఆత్మహత్యల తో వల్లకాడుగా మార్చింది కూడా ఆ పదేళ్లలోనే. ఆయన తన ఘన కార్యాలను గురించి చెప్పుకున్నప్పు డు, తెలంగాణకు జరిగిన నష్టాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా- అప్ప ట్లో తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లిం చి, ఇక్కడి ప్రజలకు చిప్ప చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టుకునే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడుకు ఇప్పు డు అలా ఖర్చు పెట్టుకునే ఛాన్సు పోయింది. అందుకే ప్రతిసందర్భంలో కంటికి కడివెడుగా ఏడుస్తున్నాడు. అంత బాధగా ఉంటే రాజీవ్‌కుమార్ చెప్పినట్టు చంద్రబాబు తెలంగాణలో వ్యాపారాలు మూసివేసి, అమరావతికి తరలించుకోవచ్చుగా. హెరిటేజ్ పన్ను ఆదా యం అంతా ఆంధ్రాకే దక్కేట్టు చూడవచ్చుగా. అది మాత్రం కుదరదు.

ఇక వ్యవసాయం గురించి, కృష్ణాజలాల పంపిణీ గురించి ఆంధ్రా ప్రభుత్వం రాసిన లేఖ ఆధిపత్య దురహంకారానికి పరాకాష్ట. పొరుగురాష్ట్రం, ఎగువరాష్ట్రం అయిన తెలంగాణతో ఎలా వ్యవహరించాలో ఆంధ్ర నాయకత్వానికి ఇప్పటికీ సోయి రాలేదని చెప్పడానికి ఉదాహరణ. ఇప్పటికీ తామేదో పెద్దన్నలమైన ట్టు, తెలివిమంతులైనట్టు, నేర్పడానికే పుట్టినట్టు వ్యవహరించడం వారి తెంపరితనాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాదనలే ఇప్పటికీ చేస్తున్నారు. తెలంగాణ వారికి వ్యవసాయం రాదు, మేము నేర్పించాము అన్నాడో దురహంకారి. తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా వ్యవసాయం ఉంది. కాకతీయులు నిర్మించిన తటాకాల నాటి నుంచి వ్యవసాయం కొనసాగుతున్నది. హైదరాబాద్ రాష్ట్రంలో 1901లోనే 8.69 లక్షల ఎకరాలు వరిపంట సాగయింది. ప్రకాశం బరాజు రాకముందు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏమి పంటలు వేసేవారో, ఎంత పంట పండించేవారో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి, కనీ సం మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లలోకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. ప్రకాశం బరాజు, దానిపైన నాగార్జున సాగరం వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు వారు వరిపంటలో ఆరితేరి ఉండవచ్చు. సాగునీటికి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసుకోవడం తెలంగాణ రైతులకు సాధ్యమైతే బంగారం పండిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఎప్పటిదాకో ఎందుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం రికార్డు స్థాయి లో వరిపంట దిగుబడి వచ్చింది. తెలంగాణ రైతు కరెంటు కోసం, పెట్టుబడి కోసం, ఎరువుల కోసం ఎదురుచూడటంలోనే తన శక్తినంతా ధారపోస్తూ వచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ కష్టాలనుంచి విముక్తి చేసింది కాబట్టి అంత పంట దిగుబడి వచ్చిం ది. తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ఇలా వాదిస్తున్నారు సరే, మరి రాయలసీమ సంగతేమిటి? వాళ్ల కూ వ్యవసాయం చేయరాదని, దిగుబడి తీయలేరని ఎగతాళి చేస్తారా? నీళ్లివ్వడానికి నిరాకరిస్తారా? తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వాదననే రాయలసీమకు వ్యతిరేకంగా చేయగలరా? ఇంత మూర్ఖపు అధికారు లు, ఇంత పైత్యపు నాయకత్వం ఉండటం ఆంధ్రా ప్రజల విషాదం.
kattashekar@gmail.com