గొంతులు కాదు, బుద్ధి పెరుగాలె

ఇసుక క్వారీల గురించి కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ ప్రభుత్వం ఇసుక క్వారీలను క్రమబద్ధీకరించి ఏటా 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. కాంగ్రెస్ ఇసుక వ్యాపారం నుంచి ప్రభుత్వానికి ఎంత సంపాదించిందో, నాయకుల సొంతానికి ఎంత సంపాదించిందో 2004-2014 సంవత్సరాల లెక్కలు మాట్లాడుతాయి. ఉన్నదీ లేనిదీ కలిపి మాట్లాడితే గవర్నర్ కోపం చేయకేం చేస్తారు? కేసీఆర్‌ను ఢీకొనాలంటే పదిహేడేండ్లపాటు ఆయన పడిన పాట్లు, ఆయన చేసిన సాధన కాంగ్రెస్ నాయకత్వం చేయాలి. ఆ దిశగా ఇసుమంతైనా అడుగులు పడిన జాడలు కనిపించవు. ఈ మూడున్నరేండ్లలో వారి అవగాహనస్థాయిలో ఏ మాత్రం మార్పు వచ్చిన సూచన కనిపించదు. మనం బాగుపడకపోతే అవతలివాడి పేరును చెడగొట్టాలన్నది చాలాపాతకాలపు రాజకీయ సిద్ధాంతం.

ప్రజల విశ్వాసాన్ని పొందడం ఒక్క రోజుతో జరిగే పనికాదు. కష్టాల్లో నష్టాల్లో సంక్షోభాల్లో తమతో ఎవరున్నారన్నదే జనం చూస్తారు. అధికారంలో ఉన్నా తమ బాగోగులను ఎవరు చూస్తున్నారన్నదే ముఖ్యం. జనపక్షపాతం ఎవరి విధానా ల్ల్లో, చేతల్లో కనిపిస్తుందన్నదే ప్రధానం. తెలంగాణ ప్రజలు రెండు దశలూ చూశారు. రాష్ట్ర సాధనోద్యమ దశలో అన్ని సందర్భాల్లో నిలబ డి కొట్లాడింది టీఆర్‌ఎస్సేనని ఇవ్వాళ రాష్ట్రంలో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం విద్రోహాలను, సంక్షోభాలను, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటున్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఏం చేస్తూ ఉన్నాయో కూడా జనం మరిచిపోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్నదేమిటో, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదేమిటో జనం గమనిస్తున్నారు. కేసీఆర్ కాకుండా మరొకరు ముఖ్యమంత్రి అయి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేదన్న ఆందోళన వ్యక్తంచేసిన తెలంగాణవాదులూ ఉన్నారు. తెలంగా ణ బాధలు తెలిసినవారు, తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారు, తెలంగాణకు వీలైనంత మంచి చేయాలని తపించినవారు నాయకుడిగా లేకపోతే తెలంగాణ ఇవ్వాళ ఉన్న పరిస్థితిలో ఉండేది కాదు. విభజన సమయంలో జిద్దుగా నిలబడి మన హక్కులను, మన నీటి, నిధుల వాటాలను సాధించుకోవడం ఒక ఎత్తయితే రాష్ట్ర ప్రగతికి దీర్ఘకాలపు బాటలు వేసి ఒక గుణాత్మకమైన మార్పునకు పునాదులు వేయడం మరో ఎత్తు. తెలంగాణ గురించి ఒక సమగ్ర దృక్పథం ఉన్న కేసీఆర్ వల్ల ఇది సాధ్యమైంది. తెలంగాణ ఇవ్వాళ వివిధ రంగాల్లో రికార్డుల పరంపర సాధిస్తున్నదంటే అందుకు తెలంగాణ నాయకత్వ అంకితభావమే కారణం. కేసీఆర్‌ను సవాలు చేయాలంటే మరో కేసీఆరే రావాలి. అంత జ్ఞానం, అంత పంతం, అంత ప్రజాపక్షపాతం, సమస్యల మూలాల్లోకి వెళ్లి చూసే సునిశిత దృష్టి కలిగిన మరో నాయకుడిని ప్రతిపక్షం చూపించగలదా? ఇప్పటికీ వారికి సమస్యలను గుర్తించడం, వాటిని ఒక పద్ధతి ప్రకారం ప్రజెంట్ చేయడమే రాలేదు. వారు ఉద్యమకాలంలో కానీ, ఈ మూడున్నరేండ్ల స్వరాష్ట్ర పాలనలో కానీ కొత్తగా పాఠాలేవీ నేర్చుకోలేదు. ఇప్పటికీ తెలంగాణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న దానికంటే ఒక ఉన్నతమైన మార్గమేదో తమ వద్ద ఉన్నదని చెప్పే దమ్ము ఒక్క నాయకుడికీ లేకపోయింది. ప్రతిపక్షం ఎంతసేపూ తిట్లూ, ఆరోపణలు, పాతచింతకాయ పచ్చడిలాంటి విమర్శలు తప్ప ఒక రాజకీయ దార్శనిక దృష్టిని ప్రజలకు పరిచయం చేయలేకపోయింది.

ఇరువైనాలుగు గంటల కరెంటు తమ గొప్పే అని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెబితే ప్రజలు నవ్విపోరా? కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోగానే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో వారానికో పాత్రికేయుల సమావేశం పెట్టి అవాకులు చవాకులు పేలుతుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తూ ఉన్నా రు? రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారబంధురం అవుతుందని నాటి ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్నంతా ప్రదర్శిస్తుంటే ఇప్పుడిచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏదో అప్పుడే షబ్బీర్ అలీ ఎందుకివ్వలేదు? ఒక్కపైసా ఇవ్వనుపొమ్మని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వాగితే ఒక్క తెలంగాణ మంత్రి అయినా ఇదేమిటని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేదంటే వీరెవరికీ తెలంగాణ సోయిగానీ, తెలంగాణ ఆత్మగౌర వస్ఫూర్తిగానీ లేదు. తెలంగాణ వస్తే వస్తుంది, మనం మాత్రం పదవులు వదలొద్దు, ప్రయోజనాలు మరువొద్దు అనుకుని ఇండ్లకు ఫైళ్లు తెప్పించుకొని సంతకాలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఆంధ్ర నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినప్పుడల్లా పిల్లలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా రాజీనామా వారి ముఖాన పడేసి, తెగించి పోరాడలేదు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మకు దగ్గర కావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అసలు తెలంగాణ సమస్యే వారి కి అర్థంకాలేదు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా తెలంగాణ సమస్య వారికి అర్థం కాలేదు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేయడం, ఉద్యోగాల క్రమబద్ధీకరణపై అడ్డంకులు కల్పించడం, రాజకీయ వాయివరుసలు మరిచి పరమ నీచమైన స్థాయికి దిగి విమర్శలు కురిపించడం కాంగ్రెస్ నాయకుల దివాలాకోరుతనాన్ని మరింత బట్టబయలు చేస్తున్న దే తప్ప వారిపై ప్రజల విశ్వాసాన్ని పెంచదు. తెలంగాణ సమస్య నీళ్లు, ఉద్యోగాలు, నిధులే. తెలంగాణ బీళ్లన్నీ నీళ్లతో తడువాలంటే ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలి. గరిష్ఠంగా నదీజలాలను తెలంగాణ భూములకు మళ్లించాలి. తెలంగాణ ఉద్యమంలో జనం బాధలగాథల నుంచి నేర్చుకున్న పాఠం ప్రథ మ ప్రాధాన్యంగా తాగు, సాగు నీరందించడం. అం దుకే కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్టులను ఒక యజ్ఞం లా ముందుకు నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు నీటికోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. కాం గ్రెస్, ఇతర ప్రతిపక్షాల నాయకులు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. త్వరగా ప్రాజెక్టు లు పూర్తిచేసి, నీళ్లివ్వాలని డిమాండు చేయాల్సిందిపోయి, వందలాది కేసులు ముందేసుకుని అదేదో పెద్ద ఉద్ధరణ కార్యక్రమంగా వీధుల్లోకి వస్తున్నారు.

తాగు, సాగు నీరు కోసం ఎదురుచూసే కోట్లాదిమం ది కాంగ్రెస్ నాయకులను చూసి ఏమనుకోవాలి? అలాగే కరెంటు సమస్యపై కాంగ్రెస్‌ది ఎదురీతే. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయనిమాట నిజమే కావచ్చు. కానీ అధికారంలోకి వచ్చి న ఆరు మాసాల్లోనే కరెంటు కోతల నుంచి తెలంగా ణ రైతాంగాన్ని, పరిశ్రమలను విముక్తి చేసింది. అదే పట్టుదలతో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ముందుకు నడిపించి, విద్యుదుత్పాదనను పెంచి ఇవ్వాళ 24 గంటల విద్యుత్ ఇస్తున్నది. ఈ విద్యుత్ అంతా తమ ఘనకార్యమేనని కాంగ్రెస్ నాయకులు చెప్ప డం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్‌కు అంత తెలివే వుంటే తెలంగాణ రాకముందే కరెంటు కోతల నుం చి విముక్తి ఇచ్చి ఉండవచ్చు కదా. కొత్త ఉత్పత్తి చేయకుండా కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? తెలంగా ణ కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు ఎవరి సేవలో తరిస్తూ కూర్చున్నది? కాంగ్రెస్ నాయకత్వానికి, కేసీఆర్‌కు ఉన్న తేడా అదే. కేసీఆర్‌కు సంకల్పం ఉంది. తెలంగాణ రైతు ఆత్మ ఉంది. అందుకే కరెంటు కోత లు లేకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమైన అం శంగా భావించి, అదనపు భారం భరించడానికి సిద్ధపడి, విద్యుత్ కొనుగోలుచేసి రైతులను, పరిశ్రమల ను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఆ అంశంపైనా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాలంచెల్లిన వాదన లు, డేటాలు ప్రదర్శనకు పెట్టడం అర్థ రహితం. ఇసుక క్వారీల గురించి కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ ప్రభుత్వం ఇసుక క్వారీలను క్రమబద్ధీకరించి ఏటా 300 నుం చి 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించిం ది. కాంగ్రెస్ ఇసుక వ్యాపారం నుంచి ప్రభుత్వానికి ఎంత సంపాదించిందో, నాయకుల సొంతానికి ఎంత సంపాదించిందో 2004-2014 సంవత్సరా ల లెక్కలు మాట్లాడుతాయి. ఉన్నదీ లేనిదీ కలిపి మాట్లాడితే గవర్నర్ కోపం చేయకేం చేస్తారు? కేసీఆర్‌ను ఢీకొనాలంటే పదిహేడేండ్లపాటు ఆయన పడి న పాట్లు, ఆయన చేసిన సాధన కాంగ్రెస్ నాయకత్వం చేయాలి. ఆ దిశగా ఇసుమంతైనా అడుగులు పడిన జాడలు కనిపించవు. ఈ మూడున్నరేండ్లలో వారి అవగాహనస్థాయిలో ఏ మాత్రం మార్పు వచ్చిన సూచన కనిపించదు. మనం బాగుపడకపోతే అవతలివాడి పేరును చెడగొట్టాలన్నది చాలాపాతకాలపు రాజకీయ సిద్ధాంతం. ఉన్నవీ లేనివీ కల్పిం చి, బురద కుమ్మరించి, బద్నాం చేసి, జనంలో పలుచన చేసి.. అంటే ఎంత అధమస్థాయి రాజకీయమై నా చేసి పైకి రావాలనుకోవడం ఈ కాలానికి సరిపడదు. ప్రజలకు ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గొంతులు పెద్దవి చేసి, మైకులు పెద్దవి పెట్టుకున్నంతమాత్రాన మంచి చెడు కాబోదు, చెడు మంచి కాబోదు.

ఇటీవల ఒక సీనియర్ టీడీపీ నాయకుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమతో పొత్తు పెట్టుకుంటేనే మళ్లీ గెలుస్తారని వాదించారు. కేసీఆర్‌కు మీ అవసరం ఏముంది? నాడే ఒంటరిగా గెలిచారు. ఇప్పుడు మీ పార్టీయే అంతిమయాత్రలో ఉంది. ఇక మీతో పొత్తు సంగతి ఎక్కడిది? అని పక్కనే ఉన్న మిత్రు డు ప్రశ్నించాడు. మాకు 5 నుంచి పది శాతం ఓట్లున్నా యి. మాతో కలవకుంటే అవన్నీ కాంగ్రెస్‌కు పడతా యి అన్నారాయన. మీరు ఇంకా భ్రమల్లో ఉన్నారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఎవరి అవసరమూ లేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి ఒక్క కారణం చెప్పం డి? అని నిలదీశాడు మిత్రుడు. ఏమి చేయలేదని ప్రజలు కేసీఆర్‌ను వదులుకుంటారు? అని మళ్లీ మిత్రుడు రెట్టించాడు. ఆ నాయకుడు నీళ్లు నమిలాడు. కాసేపటికి తేరుకుని ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిగత విమర్శలు ప్రస్తావించారు. కరెంటు వచ్చిందా లేదా, రుణమాఫీ అయిందా లేదా, వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయా లేదా? ప్రాజెక్టుల నుంచి గరిష్ఠంగా నీటిని వాడుకుంటున్నా మా లేదా? సంక్షేమ పింఛన్లు అందుతున్నాయా లేదా? డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదా లేదా? ఉద్యోగులు అడిగిన డిమాండ్లు నెరవేర్చారా లేదా? అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపాలిటీ స్వచ్ఛ కార్మికులు, హోంగార్డులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు.. ఇలా అట్టడుగున పనిచేస్తున్న సిబ్బంది జీతాలు గణనీయంగా పెరిగాయా లేదా? ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతున్నది.. ఇలా ఎన్నయినా చెబు తా? మీరు ఒక్క కారణం చెప్పండి వ్యతిరేకంగా ఓటేయడానికి? అని ఆ మిత్రుడు ప్రశ్నించాడు. ఇక ఇది తేలేది కాదని ఆ నాయకుడు నిష్క్రమించారు. ఎన్నిక లు ఇంకా ఏడాది దూరంలో ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించి గెలువాలన్న తాపత్రయాన్ని ఆ నాయకుడి మనఃస్థితి తెలుపుతుంది. చాలామంది ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. విశాల జన బాహుళ్యం మాత్రం స్వరాష్ట్రంలో ప్రారంభమైన పురోగామియాత్ర ఆగిపోగూడదని, కేసీఆర్ నాయకత్వం నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నది. ఇది ఎవరి ఇష్టాయిష్టాయిలతో నిమిత్తం లేని వాస్తవస్థితి.
kattashekar@gmail.com