పూర్ణకుంభం తెలంగాణది కూడా

మనకు తెలియాల్సిన మన చరిత్ర చాలా ఉందని మంగళవారం నల్లగొండ జిల్లా పానగల్లు సమీపంలోని ఛాయా సోమేశ్వరాలయం సందర్శించినప్పుడు మరోసారి తెలిసివచ్చింది. ఆలయ ఉప మంటప ద్వారాల్లో పూర్ణకుంభ సహిత ధ్వజశిల కనిపించింది. పూర్ణకుంభం తెలంగాణదా, ఆంధ్రదా అన్న మీమాంస గతంలో జరిగింది. కానీ దేవరకొండ కోట ప్రాంగణంలోనూ, ఛాయా సోమేశ్వరాలయంలోనూ ఆలయ ద్వారాల్లో కనిపించింది. అమరావతి బౌద్ధ స్థూపం నుంచి పూర్ణకుంభాన్ని తీసుకున్నారని మాత్రమే చదువుకున్నాం. అక్కడ పూర్ణకుంభం ఉన్నమాట నిజమే. తెలంగాణలో పూర్ణకుంభం ఉన్నదీ నిజం. ఛాయా సోమేశ్వరాలయంలో గొప్ప శిల్పకళ అసాధారణ నిర్మాణ నైపుణ్యం కళ్లకు గట్టినట్టు కనిపిస్తాయి. సప్తాశ్వాలను పూనిన సూర్య భగవానుని గుడి కూడా ఇందులో ప్రత్యేకమైనది. దశావతారాలను ఆలయ స్థంభం చట్టూ శిల్పాల్లో ప్రదర్శించారు.