హైదరాబాద్‌ను గెలిపించాలి

GH-647x450

చంద్రబాబు అప్పటికీ ఇప్పటికీ అవే మాయప్రచారాలతో బతకాలని చూస్తున్నారు. ఆయనకు ఆరోవేలుగా మారిన బీజేపీ పరిస్థితీ తెలంగాణకు అనుకూలంగా ఏమీ లేదు. హైదరాబాద్‌కున్న సహజసిద్ధమైన బలం అందరికీ ఉపయోగపడింది. హైదరాబాద్ అందరినీ పెంచింది. హైదరాబాద్‌ను పోషించామని చెప్పుకునేవాళ్లను ఇప్పటికయినా వదిలించుకోవలసి ఉంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గెలవాలి. తెలంగాణ గెలవాలి. అందుకు టీఆర్ఎస్ గెలవాలి.

తెలంగాణకు ఇది మలి పరీక్ష. హైదరాబాద్ తెలంగాణతో ఉందా లేక ఇతర శక్తుల ప్రభావంలోనే కొనసాగుతుందా అన్నది తేలవలసిన పరీక్ష. హైదరాబాద్ తెలంగాణతో లేదు అని చెప్పడానికి చాలా కాలంగా తెలంగాణ వ్యతిరేక శక్తులు చెబుతూ వచ్చాయి. గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వారి వాదనకు కొంత బలం చేకూర్చాయి. అది రాష్ట్ర విభజన సంధికాలం కావడం, హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తగిన సంఖ్యలో ఉండటం, వారిలో లేనిపోని భయాలు, భ్రమలు కల్పించడం తదితర కారణాల వల్ల ఆ ఎన్నికల్లో ఆ ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగి ఇరవై మాసాలు పూర్తయింది. విభజన సందర్భంగా హైదరాబాద్ చుట్టూ తెలంగాణ వ్యతిరేక శక్తులు అల్లిన అపోహలను, సృష్టించిన భయాలను తొలగిస్తూ ముందుకు సాగింది తెలంగాణ ప్రభుత్వం. ఏదో జరిగిపోతుందని, జరిగిపోవాలని కలలు కన్నవారికి తీవ్ర నిరాశ మిగిల్చింది తెలంగాణ. హైదరాబాద్‌పై వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతస్థాయి రాజకీయ వర్గాల్లో ఏర్పడిన అపనమ్మకాన్ని తొలగించింది. హైదరాబాద్ ఎప్పటిలాగే గౌరవంగా, స్థిరంగా పురోగమన పథంలో పయనిస్తున్నది. అంతేకాదు హైదరాబాద్‌ను ఉజ్వలంగా చూడాలనుకునే విజనరీ నాయకత్వం వచ్చింది. హైదరాబాద్‌ను తెలంగాణ ఆత్మతో పరిశీలించే నాయకత్వం వచ్చింది. నగరాన్ని మరింత అత్యాధునిక నగరంగా రూపుదిద్దడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరుసగా పథకాలు, ప్రాజెక్టులు ప్రవేశపెడుతూ పోతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో హైదరాబాద్‌లో బిట్స్ అండ్ పీసెస్‌గా మాత్రమే అభివృద్ధి జరిగింది. కుట్రపూరితమైన అభివృద్ధి విధానాలు అమలు చేశారు. తమ అనుయాయులు, అంతేవాసులు, బంధువులు, మిత్రులకు ఎక్కడ భూములు ఉంటే అక్కడ ప్రాజెక్టులు నిర్మించడం ఒక విధానంగా అమలు చేశారు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి. హైదరాబాద్‌కు ఒక సర్వసమగ్రమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించి అమలు చేయకుండా, తమకు నచ్చినచోట, నచ్చిన విధంగా అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తూ పోయారు.

మౌలికమైన సదుపాయాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆలోచనే చేయలేదు. కొత్తగూడెంలో విద్యుత్ ప్లాంటులో అంతరాయం ఏర్పడితే హైదరాబాద్‌లో గంటల తరబడి చీకటిలో ఉండిపోవలసిన స్థితి. ఏడాదిలో ఆరుమాసాలు కరెంటు కోతలతో నగర జీవితం అస్తవ్యస్థమయ్యే దుస్థితి. న్యూఢిల్లీ, ముంబయ్ వంటి నగరాలకు ఐలండ్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ అంతరాయం సంభవించినా నగరంలో విద్యుత్ సంకటం లేకుండా అనేక వైపుల నుంచి సరఫరా వ్యవస్థలను సంధానం చేయడమే ఐలండ్ పవర్ వ్యవస్థ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం వచ్చీ రాగానే కరెంటు కోతలేకుండా చేసింది. కొత్తగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయకుండానే గృహావసరాలకు విద్యుత్ కోత లేకుండా చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌దే. కేవలం సంకల్పం, ప్రజలను కడగండ్ల నుంచి బయటపడేయాలన్న తాపత్రయం ఒక్కటే హైదరాబాద్ నగరాన్ని కరెంటు కోతల నుంచి విముక్తి చేసింది. పీపుల్ కన్సర్న్ ఉన్న నాయకుడికి, కేవలం రాజకీయ నాయకుడికి ఉండే తేడా అదే. కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడానికి ఈ ఒక్క కారణం చాలు. తాగునీటి సమస్య గురించి కూడా ఆయన వచ్చే యాభైయ్యేళ్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇంతపెద్ద మహానగరానికి ప్రత్యేక (డెడికేటెడ్) తాగునీటి రిజర్వాయర్ లేదు. అరవయ్యేళ్లలో ఒక్క నాయకుడూ అటువంటి ఆలోచన చేయలేదు. కృష్ణా నది నుంచి అసలు హైదరాబాద్‌కు నీటి కేటాయింపులే చేయించలేదు. కానీ కేసీఆర్ మొదటి రెండేళ్లలోనే 35-40 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మించడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మూడవది, ట్రాఫిక్ చక్రబంధం నుంచి విముక్తి చేయడం. సిగ్నల్ ఫ్రీ రహదారులను నిర్మించాలన్న ఆలోచన అందులో భాగమే. నగరంలో ఎటునుంచి ఎటయినా తేలిగ్గా ప్రయాణం చేయగలిగే పరిస్థితులు రావాలని ఆయన స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించడం, రోడ్లను విస్తరించడం, మెట్రోను త్వరితగతిన పూర్తి చేయడం, ఎంఎంటీఎస్‌ను విస్తరించడం వంటి ప్రతిపాదనలతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అదే సమయంలో ఏ ఒక్కరూ పేదరికంతో అలమటించకూడదన్న ఆలోచన ఆయన ప్రతినిర్ణయంలోనూ కనిపిస్తున్నది. ఒకప్పుడు 200 రూపాయలు ఇచ్చిన పింఛను మొత్తాన్ని 1000 రూపాయలకు, 1500లకు పెంచడమే కాదు, సమైక్య పాలనలో సుమారు 80 వేల మందికి పించన్లు ఇస్తే ఇప్పుడు లక్షా 60 వేల మందికి ఇస్తున్నారు. రూపాయికి కిలో బియ్యం, ప్రతిమనిషికి ఆరుకిలోల బియ్యం, హాస్టలు విద్యార్థులకు సన్నబియ్యం అన్నం కేసీఆర్ ప్రాధాన్యాలను చెప్పకనే చెబుతున్నాయి. వివిధ పథకాల్లో దుర్వినియోగం అయ్యే నిధులను కాపాడితే రాష్ట్రంలోని పేదలందరికీ రెండు బెడ్రూంల ఇండ్లు నిర్మించి ఇవ్వవచ్చు అని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దళితులకు భూ పంపిణీ ప్రారంభించారు. రెండు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఇన్ని ఆలోచనలు చేసింది?

టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేయడానికి ఒక్క అనుకూలమైన కారణం కూడా లేదు. టీడీపీ తెలంగాణ పార్టీ కాదు. టీడీపీకి ఆంధ్ర ప్రయోజనాల తర్వాతే తెలంగాణ అయినా మరో ప్రాంతమయినా. పాలమూరు ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు తాగునీళ్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతో ముడిపడి ఉన్నాయి. వారి కోణం నుంచే ఏదయినా మాట్లాడతారు. ఏదయినా చేస్తారు. తెలంగాణకు ఇప్పటికీ ఏవైనా సమస్యలు ఉన్నాయంటే అవి చంద్రబాబువల్ల కొనసాగుతున్నవే. ఉద్యోగుల విభజన పూర్తి కానివ్వరు. రాష్ట్రస్థాయి యూనివర్సిటీల విభజన ఎంతకాలమయినా అలా పెండింగులోనే ఉంటుంది. హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబు కారణమని కేంద్ర మంత్రులు స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టులపై అడుగడుగునా పేచీలు పెడుతున్నదీ ఆయనే. టీడీపీకి ఓటు వేయడమంటే కోరి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పించడమే. టీడీపీకి వేసే ప్రతిఓటు తెలంగాణకు వ్యతిరేకంగా వేసినట్టే. హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ చేస్తున్న ప్రకటనలు, చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు బాధ కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌కు సహజసిద్ధ బలాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు హైదరాబాద్ రాకముందే భారీ పరిశ్రమలు, రక్షణ సంస్థలు 50కిపైగా జాతీయ సంస్థలు ఇక్కడి వచ్చాయి. అందుకు ఎవరి దయాదాక్షిణ్యాలు కారణం కాదు. రక్షణ పరంగా, వాతావరణం పరంగా హైదరాబాద్ అనువుగా ఉండటం కారణం.

కాంగ్రెస్ ప్రభుత్వమే హైటెక్ సిటీ నిర్మాణానికి తొలుత 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్లో తీర్మానం చేసింది. 1992 మే 21న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మాదాపూర్‌లో రాజీవ్‌గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు(ఇప్పటి సైబర్ టవర్స్)కు శంకుస్థాపన చేశారు. 1991-92లో ఎస్టీపీఐలో ఏడు కంపెనీలు రిజిస్టర్ చేసుకుంటే 1998-99 నాటికి 158 కంపెనీలు వచ్చాయి. రెండు లక్షల రూపాయల ఎగుమతులతో మొదలయిన ఐటీ కార్యకలాపాలు 1998-99నాటికి 200 కోట్లకు చేరాయి. 1991 నుంచి 1993 వరకు అనేక రాయితీలు కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జీవోలు ఇచ్చాయి. ఎన్టీఆర్ 1994 డిసెంబరు 12న అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారంలోకి వచ్చింది 1995 సెప్టెంబరులో. చంద్రబాబు కంటే ముందు నాలుగు సంవత్సరాలు వరుసగా 100 శాతం ఐటీ ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. జాతీయ సగటు కంటే వృద్ధి ఎక్కువగా ఉంది.

ఇక చంద్రబాబు చెప్పే ఐటీ అభివృద్ధి వెనుక కూడా చాలా కథ ఉంది. ఆయన గతమంతా తుడిపేసి మొత్తం తన చరిత్రను మాత్రమే భావి తరాలకు అందించే కుట్రపూరితమైన చర్యలకు పాల్పడ్డాడు. రాజీవ్‌గాంధీ హయాంలో మొదలు పెట్టిన టెక్నాలజీ మిషన్ చొరవల్లో భాగంగా 1991 జూన్ 5న సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 53 నగరాల్లో ఎస్టీపీఐలు ప్రారంభమయ్యాయి. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో మైత్రీవనం కాంప్లెక్సులో ఇది ప్రారంభమయింది. 1989 నుంచి 1994 డిసెంబరు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. హైదరాబాద్ ఎస్టీపీఐ వరుసగా ఎనిమిదేళ్లు 100 శాతం వృద్ధి రేటు సాధించినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ప్రతిఏటా జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే హైటెక్ సిటీ నిర్మాణానికి తొలుత 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్లో తీర్మానం చేసింది. 1992 మే 21న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మాదాపూర్‌లో రాజీవ్‌గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు(ఇప్పటి సైబర్ టవర్స్)కు శంకుస్థాపన చేశారు. 1991-92లో ఎస్టీపీఐలో ఏడు కంపెనీలు రిజిస్టర్ చేసుకుంటే 1998-99 నాటికి 158 కంపెనీలు వచ్చాయి. రెండు లక్షల రూపాయల ఎగుమతులతో మొదలయిన ఐటీ కార్యకలాపాలు 1998-99నాటికి 200 కోట్లకు చేరాయి. 1991 నుంచి 1993 వరకు అనేక రాయితీలు కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జీవోలు ఇచ్చాయి. ఎన్టీఆర్ 1994 డిసెంబరు 12న అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారంలోకి వచ్చింది 1995 సెప్టెంబరులో. చంద్రబాబు కంటే ముందు నాలుగు సంవత్సరాలు వరుసగా 100 శాతం ఐటీ ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. జాతీయ సగటు కంటే వృద్ధి ఎక్కువగా ఉంది.

చంద్రబాబు వచ్చిన తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తయింది. 1998 నవంబరు 22న అటల్‌బిహారీ వాజపేయి సైబర్ టవర్స్‌ను ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఐటీ మరింత వేగంగా అభివృద్ధి చెందింది. విచిత్రం ఏమంటే ఐటీ అభివృద్ధికి సంబంధించిన తొలినాళ్ల సమాచారం ఒక్కటి కూడా అందుబాటులో లేకుండా చేయడంలో చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. సైబర్ టవర్స్‌కు భూమి పూజ ఎప్పుడు జరిగింది? ఎవరు చేశారో చెప్పే ఫొటోలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. సైబర్టవర్స్ వెబ్ సైట్లో 1998 నవంబరు నుంచి మాత్రమే ఫొటోలు ఉంటాయి. ఐటీ చరిత్ర రాసే ప్రతిచోటా చంద్రబాబుతోనే మొదలవుతుంది. చంద్రబాబు ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాల నుంచి జనాన్ని మైమరపించడంకోసం చేసిన అనేక అసత్య ప్రచార యుద్ధాల్లో ఐటీ ప్రచారం ఒకటి. చంద్రబాబు సమయంలో ఐటీ బాగా విస్తరించిన మాట వాస్తవం. ఆయన చొరవతో అనేక పెద్ద కంపెనీలు వచ్చిన మాట నిజం. అమెరికాలోని మన ప్రాంత ఐటీ ప్రొఫెషనల్స్ కూడా మన రాష్ట్రంలో ఐటీ ఎదుగుదలకు అంతే కృషి చేశారు. ఇదే సమయంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ఇదే మోస్తరులో ఐటీ విస్తరణ జరిగింది. అది ఆ కాలం విశిష్టత. కానీ దానికి ముందూ వెనుకా ఏమీ లేదని చెప్పే కుట్ర జరిగిందే- అదీ దారుణం. చంద్రబాబు అప్పటికీ ఇప్పటికీ అవే మాయప్రచారాలతో బతకాలని చూస్తున్నారు. ఆయనకు ఆరోవేలుగా మారిన బీజేపీ పరిస్థితీ తెలంగాణకు అనుకూలంగా ఏమీ లేదు. హైదరాబాద్‌కున్న సహజసిద్ధమైన బలం అందరికీ ఉపయోగపడింది. హైదరాబాద్ అందరినీ పెంచింది. హైదరాబాద్‌ను పోషించామని చెప్పుకునేవాళ్లను ఇప్పటికయినా వదిలించుకోవలసి ఉంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గెలవాలి. తెలంగాణ గెలవాలి. అందుకు టీఆర్ఎస్ గెలవాలి.