హైదరాబాదుతోనే తెలంగాణ సాధన సంపూర్ణం

GH-647x450

‘హైదరాబాదును గెల్చుకోకుండా తెలంగాణ రాష్ర్ట సాధన సంపూర్ణం కాదు’ అని ఉద్యోగ నాయకుడొకరు అన్నారు. అది నిజమే. “శాసనసభ ఎన్నికల్లో హైదరాబాదులో గెలిచిన నాలుగు సీట్లతోనే ఆధిపత్య శక్తుల ప్రతినిధి టీడీపీ ఇంకా ఎగిరిపడుతున్నది. టీడీపీ-బీజేపీలు ఇప్పటికీ తెలంగాణ పార్టీలుగా వ్యవహరించడం లేదు. తెలంగాణపై, తెలంగాణ ప్రభుత్వంపై కక్షగట్టినట్టు దాడి చేస్తున్నాయి. వీరికి ఇక్కడ స్థానం లేకుండా చేయడం ఒక్కటే మార్గం’ అని ఒక సీనియరు సిటిజను అన్నారు. కాంగ్రెసు నాయకులయితే తెలంగాణ ఎందుకొచ్చిందా అన్నట్టు మాట్లాడుతున్నారు. మొన్న కోమటిరెడ్డ సోదరులు తమ ఆక్రోశాన్ని బాహాటంగానే బయటపెట్టారు. కేసీఆరు పాలన కంటే ఆంధ్ర నాయకుల పాలనే బాగుందని చెప్పారు. “హైదరాబాదులోని కాంగ్రెసు నాయకులు చాలా మంది ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగి తెలంగాణకు ద్రోహం చేసినవారే. వారు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు’ అని ఒక విద్యార్థి నాయకుడు ప్రశ్నించారు.