ఏది అభివృద్ధి?

GHMC1EPS
‘తాగునీటికోసం, కరెంటుకోసం ఎదురు చూడని రోజుల గురించి హైదరాబాదును ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు ఎప్పుడయినా ఆలోచన చేశయా? నగరాన్ని ఓటు బ్యాంకుగా తప్ప జీవన యోగ్యమైన నగరంగా మార్చడానికి ప్రయత్నం జరిగిందా?

హైదరాబాదు నగరానికి డెడికేటెడ్ తాగునీటి రిజర్వాయర్ల గురించి ఏ ప్రభుత్వమయినా ఆలోచించిందా? నగరానికి నిరంతరాయంగా విద్యుత్తు అందించడానికి డెడికేటెడ్ పవర్ స్టేషన్ గురించి ఎప్పుడయినా ఆలోచించారా?

హైదరాబాదును ట్రాఫిక్ ఫ్రీ సిటీ చేయాలన్న ఆలోచన ఎవరయినా చేశారా? కాంగ్రెసు, టీడీపీ నాయకుల మెదళ్లకు కూడా అందని ఆలోచనలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది.

అభివృద్ధి అంటే అందరికీ తాగునీరు, నిరంతరాయ కరెంటు సరఫరా, ఆటంకాలు లేని రవాణా సదుపాయం.

తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు ఆచరణ రూపం దాల్చాలంటే ఈ ఎన్నికల్లో టీఆరెస్ గెలవాలి.’

హైదరాబాద్ ఎన్నికలకు టీఆరెస్ నినాదం ఇది. మరి అరవయ్యేళ్లు హైదరాబాదును ఏలిన కాంగ్రెసు, టీడీపీ-బీజేపీలు ఏమి చెబుతాయి?