వారు
విద్వేషం విత్తుకుంటూ పొతేప్రేమ వృక్షాలు మొలకెత్తవు
ఉగ్రవాద మహా వృక్షాలు శాఖోప శాఖలుగా పైకి లేస్తాయి
వారు
ఉగ్రవాద మూలాలకు పుట్టిల్లు పాకిస్తాన్‌కు పాలుపోస్తారు
ఉగ్రవాదులకు ధనమూ ఇంధనమూ సమకూర్చే సౌదీనీ మోస్తారు
కేవలం అహంకరించిన సిరియాను సర్వ నాశనం చేస్తారు
బలంగా కనిపించిన ఇరాక్‌ను మరణశయ్యగా మారుస్తారు
దేశ దేశాలపై బాంబులు కురిపిస్తారు
మీరు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబితే ప్రపంచం నవ్విపోదా మరి….
మీరు ప్రపంచమంతటా కాలూ వేలూ పెట్టుకుంటూ పోతుంటే….
కడుమండినవాడు ఆత్మాహుతి బాంబుగా మారడా?
పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉండాలో మీరు నిర్నయిన్చారా?
సౌదీ రాజరికాన్ని ఇంచు కదిలించగలరా?
సిరియాలో ఇరాక్‌లో ఎవరు ఉండాలో మీరు నిర్ణయిస్తారు
భాస్మాసురున్ని తయారు చేస్తే
వాడు మంది తలలపైనే కాదు
మనతలపైనా చేయి పెడతాడని ఎందుకు అర్థం కాదు?
యుద్ధం వ్యాపారమైతే ఉగ్రవాదం అందుకు పెట్టుబడి
ముందు ఉగ్రవాది పోతాడు…వాడి వెనుక యుద్దోన్మాది పోతాడు…
ఆ తర్వాత ఆ దేశం ఉనికి కోల్పోతుంది
ఇదేగా మనం ఇన్నేళ్ళుగా చూస్తున్న విష శృంఖల.