Jayahoo Jagadish

DSC_0104

2001లో అనుకుంటా. జగదీశ్, నేను కేసీఆర్‌గారిని కలిశాము. తెలంగాణ ఉద్యమం ప్రారంభించేయోచనలో ఆయన అనేక మందిని కలుస్తున్నారని తెలిసి వెళ్లాము. చర్చల్లో పాల్గొన్నాము. ఆ తర్వాత పార్టీపెట్టడం, జగదీశ్ క్రియాశీల కార్యకర్తగా, నాయకుడిగా ఎదగడం…వరుసగా జరిగిపోయాయి…అప్పటి నుంచి ఇప్పటిదాకా….జగదీశ్ వెనుదిరిగి చూసింది లేదు. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నాడో… ఎన్ని ఆర్థిక సంకటాలు ఎదుర్కొన్నాడో… కేసీఆర్ ఆదేశించిందే తడవు ఎటువంటి సవాలునైనా స్వీకరించడానికి ముందుండేవాడు. జేబులో డబ్బులు ఉన్నాయా లేవా అన్నది పట్టించుకునేవాడు కాదు.

సిర్పూర్ కాగజ్‌నగర్ పొమ్మంటే….ఇంటిల్లిపాదినీ వెంటతీసుకుని అక్కడికి వెళ్లి ప్రచారం చేసి వచ్చాడు. కొల్లాపూర్ వెళ్లమంటే అక్కడికకీ వెళ్లాడు. జగదీశ్‌తో ప్రారంభమైనవారు చాలా మంది జారిపోయారు. చిన్న చిన్న అసంతృప్తులకే చెల్లాచెదరయిపోయారు. కానీ జగదీశ్ ఎప్పుడూ చలించలేదు. కష్టాల్లో , సుఖాల్లో తెలంగాణ ఉద్యమంతోటే ఉన్నాడు. కేసీఆర్‌కు బాసటగా ఉన్నాడు. అర్జునుడు గురి పక్షి కన్నుమీద పెట్టుకున్నట్టు జగదీశ్ తెలంగాణ సాధనమీద పెట్టుకున్నాడు. ఇటువంటి నాయకులు తెలంగాణకు కావాలి. జగదీశ్ తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీలో అడుగుపెట్టాలి.