టీఆరెస్ తొలి జాబితా అదిరింది

Telangana-map

టీఆరెస్ తొలిజాబితా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేదిగా ఉంది. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను హుజూర్‌నగర్‌నుంచి, టీజీఓ నేత శ్రీనివాస్ గౌడ్, టీఎస్‌జేయేసీ నేత పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి, ధూంధాం సాంస్కృతిక ఉద్యమ నేత రసమయి బాల్‌కిషన్ మానకొండూరు నుంచి ప్రాతినిధ్యం కల్పిచడంతోపాటు తెలంగాణ ఉద్యమంలో తొలిరోజుల నుంచి పనిచేస్తున్నవారే యాభైమంది వరకు ఉన్నారు.

ఈసారి అభ్యర్థుల ఎంపిక సరైన పంథాలో ఉందని తెలంగాణ నెటిజన్ ఉద్యమ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. శంకరమ్మను గెలిపించుకోవడానికి తెలంగాణ ఉద్యమకారులంతా సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతి అవుతున్న సమయాన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏజెంటుగా పనిచేస్తున్నాడు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: టీఆర్‌స్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విడుదల చేశారు. ఈ జాబితాలో 55 శాతం బలహీనవర్గాల అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

ఖరారైన టీఆర్ఎస్ అభ్యర్థులు :
* నాగర్ కర్నూలు – మర్రిజనార్దన్ రెడ్డి
* మక్తల్ – ఎల్లారెడ్డి
* అచ్చంపేట – గువ్వల బాలరాజు
* కల్వకుర్తి – జైపాల్‌యాదవ్
* అలంపూర్ – శ్రీనాథ్
* మహబూబ్‌నగర్ – వి.శ్రీనివాస్‌గౌడ్
* జడ్చర్ల – లక్ష్మారెడ్డి
* దేవరకద్ర – ఆలే వెంకటేశ్వరరెడ్డి
* గద్వాల – కృష్ణమోహన్
* వనపర్తి – ఎస్.నిరంజన్‌రెడ్డి
* సూర్యాపేట – జగదీశ్‌రెడ్డి
* నకిరేకల్ – వీరేశం
* ఆలేరు – గొంగిడి సునీత
* మిర్యాలగూడ – అమరేందర్‌రెడ్డి
* హుజూర్‌నగర్ – శంకరమ్మ
* వరంగల్ తూర్పు – కొండా సురేఖ
* వరంగల్ పశ్చిమ – వినయ్ భాస్కర్
* డోర్నకల్ – సత్యవతిరాథోడ్
* స్టేషన్‌ఘన్‌పూర్ – టి.రాజయ్య
* వర్ధన్నపేట – ఆరూరి రమేశ్
* పాలకుర్తి – సుధాకర్‌రావు
* నర్సంపేట – పెద్దిసుదర్శన్‌రెడ్డి
* భూపాలపల్లి – మధుసూదనాచారి
* జనగాం – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
* కొత్తగూడెం – జలగం వెంకట్రావు
* సత్తుపల్లి – పిడమర్తి రవి
* చెన్నూరు – నల్లాల ఓదేలు
* సిర్పూర్‌కాగజ్‌నగర్ – కావేటి సమ్మయ్య
* మంచిర్యాల – దివాకర్‌రావు
* ఆసిఫాబాద్ – లక్ష్మి
* ఆదిలాబాద్ – జోగురామన్న
* నిర్మల్ – శ్రీహరిరావు
* బోధన్ – షకీల్
* బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి
* బాల్కొండ – ప్రశాంత్‌రెడ్డి
* జుక్కల్ – హన్మంతు షిండే
* ఎల్లారెడ్డి – ఏనుగు రవీందర్‌రెడ్డి
* కామారెడ్డి – గంపగోవర్దన్
* ఆర్మూరు – జీవన్‌రెడ్డి
* కరీంనగర్ – గంగుల కమలాకర్
* జగిత్యాల – డా.సంజయ్
* కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
* ధర్మపురి – కొప్పుల ఈశ్వర్
* వేములవాడ – చెన్నమనేని రమేశ్
* సిరిసిల్ల – కేటీఆర్‌
* రామగుండం సోమారపు సత్యనారాయణ
* హుస్నాబాద్ – లక్ష్మీకాంత్‌రావు కుమారుడు సతీష్
* మంథని – పుట్టమధు
* పెద్దపల్లి – మనోహర్‌రెడ్డి
* మానకొండూరు – రసమయి బాలకిషన్
* హుజురాబాద్ – ఈటెల
* మెదక్ – పద్మాదేవేందర్‌రెడ్డి
* గజ్వేల్ – కేసీఆర్
* ఆందోల్ – బాబూమోహన్
* జహీరాబాద్ – మాణిక్‌రావు
* సంగారెడ్డి – చింతా ప్రభాకర్
* సిద్దిపేట – టి.హరీశ్‌రావు
* నారాయణ్‌ఖేడ్ – భూపాల్‌రెడ్డి
* మేడ్చల్ – సుధీర్‌రెడ్డి
* ఇబ్రహీంపట్నం – సామలవెంకట్‌రెడ్డి
* పరిగి – హరీశ్వర్‌రెడ్డి
* చేవెళ్ల – కె.ఎస్.రత్నం
* తాండూరు – మహేందర్‌రెడ్డి
* వికారాబాద్ – ఆనంద్
* సికింద్రాబాద్ – పద్మారావు
* పటాన్‌చెరు – మహిపాల్‌రెడ్డి
* బోథ్ – నగేష్