'చంద్రబాబు నాయుడు ఓ పెద్ద శని'

image

Sakshi | Updated: April 04, 2014 12:34 (IST)
‘చంద్రబాబు నాయుడు ఓ పెద్ద శని’

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఓ పెద్ద శని అని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. టీడీపీతో వెళుతున్న బీజేపీ కూడా భూస్థాపితం అవుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి అడిగితే తప్పేముందని కేసీఆర్ ప్రశ్నించారు. ఖచ్చితంగా సీఎం పదవి అడుగుతామని, టీఆర్ఎస్కే ఆ అర్హత ఉందని అన్నారు. ఉద్యమాలు చేయని మీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ను ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్కు 35 సీట్లు మించి రావని అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్ని కీలకాంశాలను ప్రస్తావించామని కేసీఆర్ తెలిపారు.

టీఆర్ఎస్ రెండో జాబితాను రెండు,మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సామాజిక కోణంలోనే టికెట్ల కేటాయింపు జరిగిందని కేసీఆర్ తెలిపారు. కాగా పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. 13 ఏళ్ల రాజకీయ చరిత్రలో టీఆర్ఎస్ తన మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది.