బాబును అతిగా చూపిస్తున్నారు: సాయినాథ్

logo

Sakshi | Updated: April 02, 2014 10:43 (IST)

సీమాంధ్రలో గణనీయ సంఖ్యలో లోక్‌సభ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్తూ సీఎన్ఎన్-ఐబీఎన్ ఇచ్చిన ఒపీనియన్‌ పోల్‌పై సీనియర్‌ జర్నలిస్ట్‌ పి.సాయినాథ్‌ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. అదే వేదికపై ఆయన ఆ ఒపీనియన్‌ పోల్‌ను తప్పుబట్టారు. సీమాంధ్రలో జగన్‌ విజయం సాధిస్తారని పాలగుమ్మి సాయినాథ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల గంపగుత్తగా కాంగ్రెస్‌ నాయకులు టీడీపీ వెళ్లడం వల్ల టీడీపీ పరిస్థితి కాసింత మెరుగుపడిందని మాత్రమే భావించగలమని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడును అతిగా చూపిస్తున్నారని, గత పదేళ్లుగా ఇదే జరుగుతోందని… సీఎన్ఎన్-ఐబీఎన్లోకూడా ఒపీనియన్‌ పోల్స్‌ రూపంలో చంద్రబాబు నాయుడును ఎక్కువ చేసి చూపిస్తున్నారని చేశారని సాయినాథ్‌ విశ్లేషించారు.