రాజకీయ పవనాల కాలం

telangana_state
తెలంగాణాలో ఓటర్లకు సందిగ్ధ తీర్పులు ఇచ్చే అలవాటు లేదు. ఇప్పటివరకు వచ్చిన జాతీయ స్థాయి సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు ఇంకా రాజకీయ పవనాలు బలపడలేదు.

ఎన్నికలు సమీపించే కొద్ది ప్రజల్లో ఉన్న రాజకీయ అభిప్రాయాలు ఒక సంఘటిత రూపం తీసుకుంటాయి. పార్టీలు, నాయకుల ప్రచార శక్తి సామర్థ్యాలను బట్టి పోలింగ్ నాటికి ఈ అభిప్రాయాలు ఒక బలమైన గాలి రూపం తీసుకుంటాయి.