పొత్తులు ఎప్పుడూ విపత్తులే

Political Musings

davincis-musings-casey-kotas

Davincis Musings Digital Art – Davincis Musings Fine Art Print

గెలిచి తన్నిపోయేవాడి కంటే
ముందే ఊడిపోయేవాడు బెటర్
అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు

———-
విద్యార్థులను తరిమితరిమి కొట్టినవాడికంటే
తెలంగాణవాదులపై దాడులు చేయించినవాడికంటే
తెలంగాణ తల్లిని స్టేషన్‌లో పెట్టించినవాడికంటే
కిరణ్‌రెడ్డే ఎప్పటికీ మా నాయకుడు అని ప్రకటించినవాడికంటే
తెలంగాణే వద్దు విశాలాంధ్రే ముద్దు అన్నవాడికంటే
శవాలమీద ప్రమాణాలు మరచిపోయినవాడికంటే
ఉద్యమాలు ఎగసిపడుతుంటే ప్రభుత్వంలో పరశించిపోయినవారికంటే
జనం పోరాడుతుంటే పార్టీలన్నీ చుట్టేసి వచ్చినవాడికంటే
నిలబడి కలెబడి పోరాడిన వాళ్లే ముద్దు
———-
పొత్తులు ఎప్పుడూ విపత్తులే
భావ సారూప్యతలేని పొత్తులు చిత్తుకావడం తథ్యం
ఆపద్ధర్మ పొత్తులు అట్టే పనిచేయవు,ఉపయోగపడవు
కాంగ్రెస్‌తో పొత్తు కలసి రాదు
బిజెపితో పొత్తు పనికిరాదు
పొత్తుపొడిచే కాలం దాటిపోయింది
తెలంగాణ కొత్త రాజకీయ సమరాలను చూడాలి
కొత్త రాజకీయ శక్తులు ఎదగడం చూడాలి.