పొతే పోనీ….వస్తే రానీ….

image

పొతే పోనీ….వస్తే రానీ….
ఎన్ని ఎత్తులైనా వేయనీ
ఎన్ని కుట్రలైనా చేయనీ
కొత్త రాజకీయాలు కావాలి…
కొత్త నాయకులూ కావాలి…
కొత్త పార్టీలు కావాలి…
పాతకు పాతర వేయాలి…
మనకు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు
జరిగిన అన్యాయాలకు వాళ్ళే సాక్షులు
రాజీనామాలు, రాజీడ్రామాలు ఆడినోల్లు
అడుగడుగునా అధికారాన్ని అనుభవిన్చినోల్లు
యాభై ఏళ్ళ దుఃఖానికి కారకులు
ఈ దశాబ్దపు విషాదానికి బాధ్యులు
శిక్ష అనుభవించి తీరాలి….