రాజకీయాలు సినిమా కాదప్పా!

image
నువ్వు
ఊగి పోతే ఊగడానికి
వాగిపోతే చప్పట్లు కొట్టడానికి
ఇది సినిమా కాదప్పా!

నువ్వు
ఇజం అంటే భజన చేయడానికి
నిజం అంటే నమ్మేయడానికి
ఇది టాకీస్ కాదప్పా!

హీరోలు సినిమాల్లో
నాయకులూ ప్రజల్లో
ఉండాలప్పా!

ఇక్కడ
అరిస్తే తుపాన్లు రావడం
చరిస్తే దుమ్ములేవడం
ఉండదప్పా!
గొంతు చిరిగిపోవడం
చెయ్యి విరిగిపోవడం తప్ప

ఇక్కడ
నటించొద్దప్పా,
జీవించాలి
రాసిస్తే చదవడం కాదప్పా
గుండె లోతుల్లోంచి మాట్లాడాలి…
సూడు సిద్దప్పా….
ఒకటి చెప్తాను ఇనుకో….
నువ్వేమైనా అనుకో
రాజకీయాలు సినిమా కాదప్పా!