బిల్లు పంపింది అభిప్రాయం కోసమే: దిగ్విజయ్‌సింగ్

ఢిల్లీ: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగడం సంతోషకరమని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. బిల్లు పంపింది అభిప్రాయం కోసమే తప్ప పాస్ చేసేందుకో, తిరస్కరించడానికో కాదని స్పష్టం చేశారు.