తెలంగాణకు ఎవరు ప్రమాదకారులు?

‘తెలంగాణకు అత్యంత ప్రమాదకరమైన రాజకీయ నాయకుల జాబితా తయారు చేయవలసి వస్తే అందులో మొదటి స్థానం జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుంది. రెండవ స్థానం కిరణ్‌కుమార్‌రెడ్డిది. మూడవస్థానం చంద్రబాబునాయుడిది. తెలంగాణ వీళ్ల నీడలను జాడలను వదిలించుకోకపోతే ఎప్పటికీ బాగుపడదు’- తెలంగాణ న్యాయవాద జేయేసీ నాయకుని అంచనా ఇది. ‘నవ తెలంగాణపై వీళ్ల పొడ కూడా పడడానికి వీలు లేదు’ అంటారాయన.

19-05-08 Eenadu ysr comment on telangana

‘ప్రజాస్వామ్యాన్ని, సూత్రబద్ధ రాజకీయాలను కాకుండా ధనస్వామ్యాన్ని, దౌర్జన్యస్వామ్యాన్ని నమ్మేవారెవరినీ ప్రజలు గెలిపించకూడదు’

10-07-11 Sakshi YS Jagan comments on Telangana 1

‘చంద్రబాబునాయుడు ఒకప్పుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన మాట వాస్తవమే. తెలంగాణపై రకరకాలుగా మాట మార్చిన విషయం నిజమే. కానీ ఆయన అధికారంలో లేడు. రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా తెలంగాణ సమస్యను రేపెట్టాడు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు అనుకూలమంటూనే తెలంగాణవాదులను తొక్కిపెట్టాడు. తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. తెలంగాణకు అడ్డమూ కాదు, నిలువూ కాదంటూనే విభజనను పదేళ్లు వెనుకకు నెట్టాడు. జగన్‌మోహన్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కంటే ప్రమాదకారి. ఇచ్చేవాడిని కాదు, అడ్డుకునేవాడిని కాదు అని చెప్పిన పెద్దమనిషి ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నాడు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క తెలంగాణకే కాదు అసలు రాజకీయాలకే ప్రమాదకారి. ఆయన బాటలో పోతే ఆంధ్రా ప్రజలు కూడా నష్టపోతారు’ అని ఆయన విశ్లేషించారు.

‘ప్రజాస్వామ్యాన్ని, సూత్రబద్ధ రాజకీయాలను కాకుండా ధనస్వామ్యాన్ని, దౌర్జన్యస్వామ్యాన్ని నమ్మేవారెవరినీ ప్రజలు గెలిపించకూడదు’ అని ఆయన అన్నారు. ఏ నీతీ, ఏ విలువలకూ కట్టుబడని రాజకీయ నాయకులను ప్రజలు తిరస్కరించాలి.