ఎవరు ఎవరిని పోషిస్తున్నారు? ఎవరు ఎవరిని లూటీ చేస్తున్నారు?

అఖిల భారత బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం(ఎఐబిఇఎ) విడుదల చేసిన బ్యాంకు డిఫాల్టర్ల జాబితా చూడండి-కళ్లు చెదరిపోయే విషయాలు తెలుస్తాయి. మనకు నీతులు చెబుతున్నవాళ్లెవరో, మనపై ఆధిపత్యం చెలాయిస్తున్నవాళ్లెవరో అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో బ్యాంకులకు అత్యధిక మొత్తాలను ఎగవేసిన 50 మందిలో తొమ్మిది మంది మనవాళ్లే. అందులో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న లగడపాటి రాజగోపాల్ కంపెనీ లాంకో ఉంది. కేంద్రమంత్రి కావూరి సాంబశిరావు కంపెనీ ఉంది.
eenadu
ప్రపంచానికి అస్తమానం నీతులు చెప్పే చంద్రబాబు కుడిభుజం సుజనా చౌదరి అలియాస్ సత్యనారాయణ చౌదరి కంపెనీ ఉంది. లాంకో మొండిబాకీ 533 కోట్లు కాగా ప్రోగ్రెసివ్ కన్స్రక్షన్స్ బాకీ 351 కోట్లు. సుజనాచౌదరి వాటా 330 కోట్లు. టాప్ 50 కంపెనీలు ఎగవేసిన రుణాల మొత్తం 40 వేలకోట్లకు పైగానే ఉంది. ఏం చేసినా వీళ్లు రాజకీయాల్లో ఉంటారు. చట్ట సభల్లో ఉంటారు. పదవుల్లో ఉంటారు. ఉద్యమాలు చేస్తుంటారు. చిన్నా చితకా అప్పులు చేసిన రైతుల నుంచి వాటిని వసూలు చేయడానికి చట్టాలు చేస్తుంటారు. ఇక్కడ ఆ లిస్టులు చూడండి:
Bank NPAs_List_Jan062014_Page_1
Bank NPAs_List_Jan062014_Page_2
TOP 30 BAD LOANS SBH
TOP 30  BAD LOANS ANDHRA BANK