హెలికాప్టర్ పేల్చుతామనడమే కాదు, రైళ్లను పేల్చుతామనడం కూడా తప్పే

పేల్చడాలు, ప్రేలాపనలు ఎవరు చేసినా తప్పే.

కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా వరుసగా పేలుతూనే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రాజకీయంగా పేల్చివేసే పనిలో ఆయన బాగా ముందుకెళుతున్నారు. ఆయన ఏ మర్యాదలనూ పాటించడం లేదు.

పేల్చడాలు, ప్రేలాపనలు ఎవరు చేసినా తప్పే. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కిరణ్ కరీంనగర్‌కు వస్తే హెలికాప్టర్‌ను గాలిలోనే పేల్చివేస్తామని ప్రకటించారు. ఇంకేం సీమాంధ్ర చానెళ్లు గోల మొదలు పెట్టాయి. నిజమే ప్రభాకర్ అలా అని ఉండకూడదు. ఇప్పుడు అసలే సంయమనం కోల్పోవద్దు. ముఖ్యమంత్రి చేష్టలు చూసినవారికి అంతటి కోపం రావడం సహజమే. కానీ నిభాయించుకోగలిగినవాడే నాయకుడు.

పొన్నం వ్యాఖ్యలపై ఇంత రాద్ధాంతం చేస్తున్న సీమాంధ్ర మీడియా సీమాంధ్ర నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలను మరచినట్టున్నారు. నర్సరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రాష్ట్ర విభజనపై ముందుకెళితే రైళ్లను పేల్చివేస్తామని ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా వరుసగా పేలుతూనే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రాజకీయంగా పేల్చివేసే పనిలో ఆయన బాగా ముందుకెళుతున్నారు. ఆయన ఏ మర్యాదలనూ పాటించడం లేదు.

అయినా తెలంగాణవాదులు ఓపికగానే స్పందించడం మంచిది. ఆయన క్రికెట్‌లో భారీ లక్ష్యాన్ని ముందుపెట్టుకుని ఆఖరి ఓవర్ ఆడుతున్నాడు. ఆయనే తెలంగాణను గెలిపిస్తారు. ఆవేశపడి ఎవరూ ఆయనపై రెచ్చిపోవద్దు.