ఆఖరి బంతికాదు, అంత్యకాలం

బ్యాట్ ఊపిందీ లేదు, బంతిని ఆపిందీ లేదు

ముఖ్యమంత్రికి అధికారం ఉంది కాబట్టి శాసనసభ వ్యవహారాల మంత్రిని మార్చారట. కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు అధికారం ఉంది కాబట్టి తెలంగాణ బిల్లును ఆమోదించొచ్చు కదా! ఇంత చిన్న లాజిక్ అర్థం కాలేదేమిటి కిరణ్!

బంతిని చూసి బ్యాటింగ్ చేయాలట. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అలాగే చేశాడట. ఈయన అంత గొప్పగా బ్యాటింగ్ చేస్తే బిల్లు అసెంబ్లీ దాకా ఎందుకొచ్చిందో! ఈ మహానుభావుడు ఇప్పటిదాకా బ్యాట్ ఊపిందీ లేదు, బంతిని ఆపిందీ లేదు. క్రీజులో ఉన్నాడంతే. బంతిని కొట్టిందీ లేదు. పరుగులు తీసిందీ లేదు.

సీడబ్ల్యూసీ తీర్మానం చేయదన్నారు. యూపీఏ ఒప్పుకోదన్నారు. కేబినెట్ నోట్ రానే రాదన్నారు. జీవోఎం కడతేరదన్నారు. బిల్లు రూపొందదన్నారు….అసెంబ్లీకి రాదన్నారు…..ఈయన బ్యాట్ పట్టుకుని ఉండగానే కేంద్రం విజయవంతంగా బౌలింగ్ పూర్తి చేస్తోంది. బిల్లు అసెంబ్లీకి వచ్చింది. ఎజెండాలోకొచ్చింది. బిల్లు రేపు ఢిల్లీకి కూడా తిరిగి వెళుతుంది.