జగన్,బాబు బంద్‌కు ఎందుకు పిలుపునివ్వలేదు?

రాయలసీమను విభజించి రెండు జిల్లాలను తెలంగాణలో కలుపాలని జరుగుతున్న ప్రయత్నాలకు విచిత్రంగా తెలంగాణవాదుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. కానీ సమైక్య రాష్ట్రాన్ని కాపాడతామని ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ విభజనపై స్పందించలేదు. నిజానికి బంద్‌కు పిలుపునివ్వాల్సింది ఈ ముగ్గురు నేతలు. ఆందోళన చేయాల్సింది ఈ ముగ్గురు నేతలు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ ముగ్గురు ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీగా ఉన్నారు. రాయలసీమ విభజన గురించి గట్టిగా ప్రతిఘటిస్తున్న సూచనలు లేవు. బహుశా రాయల తెలంగాణ కారణంగానైనా తమకు రాజకీయ మనుగడ కొనసాగుతుందన్న ఆలోచన ఈ నాయకులకు ఉందేమోననిపిస్తుంది. తెలంగాణలో ఎంట్రీకి ఈ రెండు జిల్లాలు ఉపయోగపడతాయని వారు భావిస్తూ ఉండవచ్చు. అందుకే వారు వ్యూహాత్మకంగా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తూ ఉండవచ్చు.