బండి కింద కుక్క

ఎక్కడో ఓ చిన్న కథ విన్నాను…..

2009052954680701

నీడకోసం ఒక కుక్క నిలిచి ఉన్న బండికింద చేరింది. ఆ తర్వాత బండి కదలడం మొదలుపెట్టింది. బండితోపాటు కుక్క కూడానడవడం ఆరంభించింది.

నడుస్తున్న కొద్దీ బండిని తానే లాగుతున్న ఫీలింగ్ కలిగింది కుక్కకు. తాను ఆగిపోతే బండి ఆగిపోతుందనుకునే దాకా వెళ్లింది. చివరికి బండిని ఆపేద్దామనుకుంది. ఠక్కున ఆగిపోయింది.

బండి మాత్రం ఆగడం లేదు. ముందుకు కదులుతూనే ఉంది. కుక్క మాత్రం ఎండలో పడ్డది. నకనకలాడింది. మళ్లీ నీడకోసం పరుగులు తీసింది. బండిమాత్రం కనిపించనంత దూరం ముందుకెళ్లింది.

ఈ బండి కింద కుక్క ఎవరో, ఈ బండి ఏమిటో?