శ్రీశైలం ఎవరిది?

1972 నుంచే కుట్రలు

శ్రీశైలం ప్రాజెక్టు సీమాంధ్రలోనే ఉందంటూ ఇప్పుడు ఒక కొత్త వివాదాన్ని లేవనెత్తేందుకు సీమాంధ్ర ప్రభుత్వం, సీమాంధ్ర మీడియా ప్రయత్నిస్తున్నాయి. అది 1972లో జారీ చేసిన జీవోనట. అంటే అప్పుడి నుంచే కుట్రలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. రెండవ అంశం, అప్పుడు జారీ చేసింది జీవోనే. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన బిల్లులో ఏ ప్రాంతం ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది. అందువల్ల ఆందోళన పడవలసిన పనిలేదు.

Census of India: View Population Details

మరీ ముఖ్యమైన అంశం ఏమంటే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం సీమాంధ్రలో ఉందని చెబుతున్నది, రాస్తున్నది పచ్చి అబద్ధం. శ్రీశైలం ప్రాజెక్టు ణొఫ్ట్ ఫ్లాంక్ కాలనీ-ఎల్‌ఎఫ్‌సి) గ్రామం, అంటే ఎడమవైపున ఉన్న గ్రామం అంతా మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో ఇప్పటికీ ఉంది. సెన్సస్ లెక్కల్లో, రెవెన్యూ లెక్కల్లో ఆ ప్రాంతమంతా మహబూబ్‌నగర్‌లోనే ఉంది. ఇక్కడ మ్యాపులు చూడండి. సెన్సస్ లెక్కల్లోని పేజీలు చూడండి. అమ్రాబాద్ దక్షిణ సరిహద్దు శ్రీశైలం ప్రాజెక్టు రైట్ ఫ్లాంక్ కాలనీ అని ఉంది.

mbnr_roadmap2

దొంగలెక్కలు వండివార్చడంలోనూ, జీవోలను తారుమారు చేయడంలోనూ, దొంగ జీవోలు తేవడంలోనూ సీమాంధ్ర ప్రభుత్వం, మీడియా అందరూ ఆరితేరినవారు. అయితే ఇవేవీ వాస్తవ పరీక్షకు నిలబడవు.

map2

Seagate Crystal Reports - Dist_