నీటి కుట్రలు ఈనాటివా?

శ్రీశైలం మాదే
నాగార్జునసాగర్ మాదే
చార్మినార్, గోల్కొండా మావే
అంతెందుకు హైదరాబాదూ మాదే
కొండ మీద కోతీ మాదే
గొంతెమ్మల వాదన.

800px-NagarjunaSagarDam

ఈ గొంతెమ్మలకు తెలియనిది ఏమంటే రెవెన్యూ మ్యాపుల్లో శ్రీశైలం ఎడమ గట్టు అంతా తెలంగాణలోనే ఉంది. నాగార్జునసాగరం కుడి, ఎడమ కాలువలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. మళ్లీ మాట్లాడితే నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో అత్యధికభాగం తెలంగాణలోనే ఉంది. ఇవన్నీ కాదు జూరాల ప్రాజెక్టు తెలంగాణలోనే ఉంది. అక్కడో భారీ ఆనకట్ట కడితే మీరు చేసేదేమీ లేదు. పిచ్చి కూతలు, పిచ్చి రాతలు మీ వెకిలితనాన్ని బయటపెడతాయి. మీ కుట్రలను పట్టిస్తాయి. ఇంకా చావు తెలివితేటలను ప్రదర్శించవద్దు. తెలంగాణ గడ్డమీద వ్యాపారం చేసుకోవాలనుకునే వారెవరయినా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇక్కడి ప్రజలు సహించరు. శాంతంగా ఉన్న తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దు. రాజాజీతో అనిపించుకున్నమాటలు ఇక్కడా అనిపించుకోవద్దు.