తోక తలను ఆడించగలదా?

ఊపినంతమాత్రన తోక తల కాలేదు
చేతిలోని ఆయుధం చెయ్యితో సమానం కాదు
అరచినంతమాత్రాన పీత నేత కాలేడు
ఆదేశించినంతమాత్రాన ఢిల్లీ స్తంభించిపోదు
వందసార్లు చెబితే అబద్ధం నిజం కాదు
గంటసేపు వదరితే అన్యాయం న్యాయం కాదు
ఇక్కడ రంగులు తెలిశాయి,
అక్కడ రంగులు వెలిశాయి
ఇక వీళ్లను వీళ్లు దాచుకోవడం కష్టం!