ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
నీళ్లు లేని కుండకు చప్పుడెక్కువ
చేష్టలుడిగిన వాడికి మాటలెక్కువ
నీతిలేని వాడికి నీల్గుడెక్కువ
నిలకడలేని వాడికి నాలుకలెక్కువ
మదమెక్కినవాడికి పేచీలెక్కువ
పసలేనివాడికి అబద్ధాలెక్కువ
వీళ్లంతా ఇప్పుడు సమైక్యమయ్యారు!