తెలుగు ప్రజలకు ఏమి ఖర్మరా బాబు!

ఓట్లకోసం, సీట్లకోసం తెలంగాణపై సోనియమ్మకు లేఖలు ఇప్పించాలి కానీ తెలంగాణ ఇవ్వరాదు.
ఓట్లకోసం, సీట్లకోసం తెలంగాణవాదులతో కలసి ఎన్నికల్లో పోటీచేస్తాం, అధికారంలోకి వస్తాం, తెలంగాణ మాత్రం ఇవ్వడాన్ని సహించం.
ఓట్లకోసం, సీట్లకోసం తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని తీర్మానం చేస్తాం, కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకోం.
ఓట్లకోసం, సీట్లకోసం మాటమాటకు మాటలు మార్చుకుంటూ ఉంటాం, తెలంగాణ ఇవ్వడాన్ని మాత్రం అంగీకరించం.
మండపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణ, సూరవరం ప్రతాపరెడ్డి…. జననేత ప్రస్తావించిన తెలుగు వైతాళికుల పేర్లు ఇవి.
తెలుగు చరిత్ర పురుషుల పేర్లు కూడా సరిగా ఉచ్చరించలేం, కానీ తెలుగు జాతి చరిత్ర గురించి మాట్లాడతాం. సోనియమ్మ జ్ఞానం గురించి మాట్లాడతాం.
ఓట్లకోసం సీట్లకోసం ఏమైనా చేయవచ్చు, ఒక్క తెలంగాణ ఇవ్వడం తప్ప!
హతవిధీ! తెలుగు ప్రజలకు ఏమి ఖర్మరా బాబు!

…………

ఒక బానిస అన్నాడు-
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి దొరలకు అప్పగిస్తారా? అని.
ఏమి జ్ఞానమురా బాబూ నీది?
తెలంగాణలో ఎంతమంది దొరలు కలిస్తే మీ దొరతో సరిపోతారు?
ఎన్నేళ్లు సంపాదిస్తే అటువంటి సామ్రాజ్యం నిర్మించగలరు?