బాబులూ, బాధలూ, దీక్షలూ

ఒక బాబేమో సమన్యాయం చేయాలంటూ మొదలు పెట్టి సమైక్యాంధ్ర బాట పట్టాడు. ఆయన బాధ అర్థమైంది తెలంగాణ ప్రజలకు.
ఇంకో బాబేమో రాష్ట్రాన్ని అడ్డంగా నరికేస్తారా అని మొదలు పెట్టాడు. ఎక్కడ తేలతాడో తెలియదు. పోనీ నిలువుగా నరకమంటావా? ఎలా నరకమంటావో చెప్పు?
నీ బాధేమిటో చెప్పు?

సీమాంధ్రకు న్యాయం చేయాలంటే ఏం చేయాలో చెప్పు? ముసుగులో గుద్దులాట, నీడలతో యుద్ధాలు ఎంతకాలం?
నిజానికి నీ బాధ తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది. అర్థం కానిది తెలంగాణ తెలుగు తమ్ముళ్లకే. వాళ్లను ఎక్కడ ముంచుతావో, ఏ తీరానికి చేర్చుతావో చెప్పు బాబూ?

బాబుల బాధలూ, దీక్షలూ రెండూ ఆంధ్రలో ఆధిపత్యంకోసమే!
వాళ్లకేమయినా అయితే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం లేదు మరి!