ఎవరికి పుట్టిన బిడ్డ విశాలాంధ్ర?

విశాలాంధ్ర ఉద్యమం ఎవరు మొదలుపెట్టారు? ఎవరు పైరవీలు చేశారు? ఎవరికి అవసరమయింది? ఆంధ్ర నాయకులు చెప్పే అబద్ధాలకు అంతులేకుండాపోయింది. విశాలాంధ్ర కావాలని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారట. అసెంబ్లీలో తీర్మానం చేసిపంపితే అశోక్‌బాబు గారొచ్చి దయదలిచి మనల్ని కలుపుకున్నారట. అయ్యదేవర కాళేశ్వర్‌రావు హైదరాబాద్‌కు వచ్చి పైరవీలు చేసిందీ ఆయనకు తెలియదు. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి తెలంగాణ రెడ్లతో చర్చలు జరిపిందీ తెలియదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు నుంచే అక్కడి నాయకులు హైదరాబాద్‌పై కన్నేసిన విషయమూ తెలియదు.

అధికారాన్ని, ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు అబద్ధాలేం ఖర్మ, అభూత కల్పనలూ, వక్రీకరణలూ….ఎంతదూరమయినా వెళతారు.
ఇక్కడో క్లిప్పింగ్ చూడండి: ఆంధ్రపత్రికలో 1953 ఆగస్టు 16న వచ్చిన వార్త: బులుసు సాంబమూర్తి కర్నూలు గురించి ఏమని సెలవిచ్చారో తెలుస్తుంది:

ap160853f

Indian Express clipping:
Indian Express Dated-1oct-53 copy