ఖాళీ కిరణం గోలగోల

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
వాలిపోయే సూర్యుడికి కాంతి ఎక్కువ
సరుకులేని సినిమాకు ప్రచారం ఎక్కువ
ఖాళీ బిందె గోల ఎక్కువ
ముఖ్యమంత్రికి మాటలెక్కువ విషయం తక్కువ
……..
మంత్రివర్గాన్ని కలిపి ఉంచలేని ముఖ్యమంత్రి
సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచలేని పెద్దమనిషి
సొంత జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను వెంట ఉంచుకోలేని ఒంటరిజీవి
రెండు ప్రాంతాలకు సమవర్తిగా వ్యవహరించలేని పక్షపాతి
ఎవడో పాయింట్లు రాసిస్తే తప్ప తెలుసుకోలేని మహాజ్ఞాని
…….
ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, ఇక్కడే చదివినా
యాభైమూడేళ్లయినా ‘మునగడ’ పీడ వదలని హైదరాబాదీ
……
సమైక్యత గురించి మాట్లాడుతున్నాడు….
కూట్లో రాయి తీయలేని వాడు,
ఏట్లో రాయి తీయాలని చెబుతున్నాడు!
పాపము శమించుగాక!