మేమూ మీరూ ఒకటి కాదు

మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు
మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు
మీ పోలీసుబాసు మా పోలీసు కాదు
వాళ్లు మీకు రక్షకులు, మాకు తక్షకులు!
******
సాగరహారానికి రావడానికి మేము వందల బారికేడ్లు, వేలాది లాఠీలు దాటుకుని రావాలి
మీరు సమైక్య సభలకు రావడానికి పైలట్ కార్లు, పోలీసు కాన్వాయ్‌లు స్వాగతం పలుకుతాయి
జైతెలంగాణ నినాదాలు చేస్తే మా వీపులు విమానం మోతమోస్తాయి
సమైక్యాంధ్ర నినాదాలు మీకు వీనుల విందుగా కనువిందు చేస్తాయి
*******
ఉద్యమం మాకు జీవితంలో భాగమైపోయింది
ఉద్యమం మీకు విహారయాత్రయింది
మాట తప్పడం మీకు అలవాటయింది
మాటకోసం కొట్లాడడం మాకు అనివార్యమయింది
అణచివేత మీ ఆయుధం
తిరుగుబాటు మా జీవితం
********
మేమూ మీరూ ఒకటి కాదు!
మీకూ మాకూ ఇంకేమాత్రం పొసగదు!